Moviesహనుమాన్ సినిమా ఎఫెక్ట్ : జాక్ పాట్ ఆఫర్ కొట్టేసిన ప్రశాంత్...

హనుమాన్ సినిమా ఎఫెక్ట్ : జాక్ పాట్ ఆఫర్ కొట్టేసిన ప్రశాంత్ వర్మ .. కలలో కూడా ఊహించని ఛాన్స్ ఇది..!!

ప్రశాంత్ వర్మ యంగ్ డైరెక్టర్ ..మంచి టాలెంట్ ఉంది .. తాను అనుకున్న కథను జనాలకు అర్థమయ్యే విధంగా బాగా తెరకెక్కిస్తాడు . ఇప్పటివరకు ఆయన తెరకెక్కించిన సినిమాలు అన్నీ కూడా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయం అందుకున్నాయి . ఇంతవరకే తెలుసు జనాలకి . కానీ ప్రశాంత్ వర్మ చాలా మెండోడు. అనుకున్నది కచ్చితంగా సాధిస్తాడు . అది ఎలా అయినా సరే .. హనుమాన్ సినిమా విషయంలో ఆయన నిలబడిన తీరు ముందుకెళ్ళిన విధానం అభిమానులను ఆశ్చర్యానికి గురిచేసాయి .

బడా హీరోతో కాంపిటీషన్ ఇచ్చి మరి సంక్రాంతి రేస్ లో నెంబర్ వన్ స్థానంలో నిలిచాడు.. అంటే కచ్చితంగా ప్రశాంత్ వర్మ కున్న డెడికేషన్ కారణం అని చెప్పాలి. గుంటూరు కారం సినిమాతో పోటీకి వచ్చిన హనుమాన్ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. ఇంకా చెప్పాలి అంటే గుంటూరు కారం కన్నా రెండు మెట్లు ఎక్కువగానే సక్సెస్ అందుకునింది. ఈ క్రమంలోనే ప్రశాంత్ వర్మ పేరు మారుమ్రోగిపోతుంది . తన నెక్స్ట్ సినిమాను బాలయ్యతో డైరెక్ట్ చేయబోతున్నాడు అన్న ఓ న్యూస్ వైరల్ అవుతుంది.

బాలయ్య ప్రజెంట్ బాబీ దర్శకత్వంలో ఓ సినిమాకి కమిట్ అయ్యాడు. ఆ తర్వాత అఖండ 2 సెట్స్ పైకి తీసుకెళ్లబోతున్నారట . కానీ ప్రశాంత్ వర్మ టాలెంట్ చూసి ఆయనను మెచ్చుకున్న బాలయ్య ఆయనకు ఒక సినిమాను డైరెక్టర్ చేసే ఛాన్స్ ఇచ్చాడట . ప్రజెంట్ ఇదే న్యూస్ వైరల్ అవుతుంది. ప్రశాంత్ వర్మ లాంటి చిన్న డైరెక్టర్ కి బాలయ్య ఛాన్స్ ఇవ్వడం అంటే నిజంగా అది గ్రేట్ అని చెప్పాలి..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news