ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ వైరల్ అవుతుంది. మహేష్ బాబు అభిమానులకు గుంటూరు కారం బాగా నచ్చేసింది . ఈ క్రమంలోనే సినిమాకి సంబంధించిన వార్తలను ట్రెండ్ చేస్తున్నారు . మహేష్ బాబు కెరియర్ లో ఎన్నో సినిమాలో నటించాడు . కానీ అన్ని సినిమాల్లోకి ప్రత్యేకం గుంటూరు కారం. ఎందుకు గుంటూరు కారం అంత ప్రత్యేకమైనది అనేది ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం..!!
1) నాన్న లేకుండా: తన తండ్రి లేకుండా రిలీజ్ అయిన ఫస్ట్ సినిమా ఇదే . ప్రతిసారి తన సినిమా రిలీజ్ అయినప్పుడు తండ్రి ఎంతో ప్రోత్సాహం ఇచ్చేవాడు . ఈసారి అలా ప్రోత్సహించడానికి తల్లిదండ్రులు లేరు . మీరే నా తల్లిదండ్రులు అంటూ ప్రీ రిలీజ్ ఈవెంట్ లోను మాట్లాడారు .
2) గుంటూరు కారం బ్యాక్ డ్రాప్: త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు గుంటూరు మిర్చి యార్డ్ బ్యాక్ డ్రాప్ ఎంచుకున్నారు . ఇందులో తల్లి కొడుకుల సెంటిమెంట్ బాగా వర్క్ అయింది . ఇప్పటివరకు మహేష్ బాబు కెరియర్ లో ఇలాంటి సినిమా రాలేదు.
3) శ్రీ లీల : తనకంటే చాలా చిన్న ఏజ్ గల శ్రీలీలతో కెమిస్ట్రీలో అదరగొట్టడమే కాకుండా కుర్చి మడత పెట్టి అనే సాంగ్లో పూనకాల వచ్చినట్లు ఊగిపోయాడు మన మహేష్ బాబు . కచ్చితంగా ఈ డాన్స్ సిల్వర్ స్క్రీన్ పై చూస్తేనే బాగుంటుంది .
3) త్రివిక్రమ్ దర్శకత్వం : ఆల్రెడీ వీళ్ళ కాంబోలో రెండు సినిమాలు వచ్చాయి .. అతడు , ఖలేజా ..ఒకటి హిట్ మరొకటి ప్లాప్ ..అయినా ఖలేజ సినిమా అభిమానులను ఆకట్టుకుంది . అయితే ముచ్చటగా వచ్చిన మూడో సినిమా ఏ విధంగా జనాలను ఆకట్టుకుంటుందో అన్న క్యూరియాసిటీ అందరిలోనూ ఉంది.
4) తమన్ మ్యూజిక్: మహేష్ బాబు సినిమా అంటే తమన్ మ్యూజిక్ బిజిఎం బాగా గుర్తొస్తాయి . థియేటర్ లు దద్దరిల్లి పోవాల్సిందే . అలాంటి మ్యూజిక్ మన ఇంట్లో టీవీలో వినడం కన్నా పెద్ద స్క్రీన్ పై చూడడమే చాలా మత్తెక్కిస్తుంది. అందుకే గుంటూరు కారం సినిమాను కచ్చితంగా థియేటర్స్ లో చూడాలి అంటున్నారు అభిమానులు..!!