Movies"పవన్-నేను కార్ వ్యాన్ లో అలా చేసే వాళ్లం"..హీట్ పెంచేస్తున్న...

“పవన్-నేను కార్ వ్యాన్ లో అలా చేసే వాళ్లం”..హీట్ పెంచేస్తున్న బిగ్ బాస్ బ్యూటీ మాటలు..!!

బిగ్బాస్ ఎంతమందికి లైఫ్ ఇచ్చిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . మరీ ముఖ్యంగా కొంతమంది జీవితాన్ని నాశనం చేస్తే కొంత మందిని మాత్రం టాప్ రేంజ్ కి తీసుకెళ్ళింది . ఆ లిస్టులోకే వస్తుంది అశ్విని . ఇటీవల తెలుగులో ముగిసిన బిగ్ బాస్ సీజన్ సెవెన్ లో ఆమె వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చి తన కంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది . ఉన్నది కొన్ని వారాలు అయినా హౌస్ లో మాత్రం బాగా చలాకీగా టాస్కులు ఆడి ప్రేక్షకులను ఆకట్టుకుంది.

తన అందాల ఆరబోతుల్లో అయితే అస్సలు మనం ఎక్స్పెక్ట్ చేయని విధంగా చేసింది . రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అశ్విని తన హీరో పవన్ కళ్యాణ్ గురించి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఆమె మాట్లాడుతూ..” పవన్ కళ్యాణ్ అంటే నాకు పిచ్చి ..అంతా ఇంతా కాదు పిచ్చెక్కిచ్చేంత పిచ్చి .. నేను ఆయనతో కలిసి గబ్బర్ సింగ్ అనే సినిమాలో నటించాను. శృతిహాసన్ ఫ్రెండ్ గా చేశాను దాదాపు 3 నెలల పాటు జర్నీ చేశాను”.

” షూటింగ్ సమయంలో పవన్ సార్ నన్ను చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు ..నన్ను కూర్చోబెట్టుకొని చక్కగా మాట్లాడేవారు.. డాన్సులు చేయించేవారు .. జోకులు వేసుకునే వాళ్లు సరదాగా గడిపే వాళ్ళం .. షూట్లో అశ్విని కమాన్ అంటూ నన్ను ఎంకరేజ్ చేసేవారు.. ఆయన ఎప్పుడు బోర్ కొట్టిన సరే అందరం కలిసి చక్కగా ఎంజాయ్ చేసేవాళ్ళం.. ఇద్దరం కార్ వ్యాన్ లో ఉండే వాళ్ళం.. ఆయన నన్ను మరిచిపోయి ఉంటారేమో కానీ పవన్ కళ్యాణ్ ఎప్పటికీ నా వాడే అంటూ చెప్పుకొచ్చింది “. ప్రెసెంట్ ఆమె చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news