గత 48 గంటల నుంచి సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో హీరో విజయ్ దేవరకొండ హీరోయిన్ రష్మిక మందన్నాల నిశ్చితార్థం చేసుకోబోతున్నారు అన్న వార్త వైరల్ అవుతుంది. అంతేకాదు ఫిబ్రవరి 14వ తేదీ వీళ్ళ ఎంగేజ్మెంట్ జరగబోతుంది అంటూ కూడా వార్తలు వినిపిస్తున్నాయి . దీంతో సోషల్ మీడియాలో ఫాన్స్ షాక్ అయిపోతున్నారు . ఇద్దరు కెరియర్ టాప్ పొజిషన్లో ఉన్నప్పుడే పెళ్లి ఎలా చేసుకుంటారు అంటూ కొందరు అంటుంటే మరికొందరు ఇదంతా ఫేక్ అంటూ కొట్టి పడేస్తున్నారు.
కానీ కొంతమంది మాత్రం నిజంగా వీళ్లు పెళ్లి చేసుకుంటే బాగుంటుంది అంటూ సజెస్ట్ చేస్తున్నారు . కాగా కుటుంబ సభ్యులు ఈ విషయంపై క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తుంది. సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వార్తలను చూసి టెన్షన్ పడిపోయిన కుటుంబ సభ్యులు ఏకంగా విజయ్ దేవరకొండ పేరెంట్స్ కు రష్మిక పేరెంట్స్ కు కాల్ చేసి క్లారిటీ తీసుకున్నారట . నిజంగానే వీళ్లు నిశ్చితార్ధం చేసుకోబోతున్నారా అన్న న్యూస్ విని షాక్ అయిపోయారట.
అయితే ఇది మొత్తం ఫేక్ అని ఇది ఎటువంటి అఫీషియల్ ప్రకటన కాదని .. అలాంటిది ఏదైనా ఉంటే మేము అఫీషియల్ గా ప్రకటిస్తామని విజయ్ దేవరకొండ తల్లి వాళ్ళ బంధువులకి క్లారిటీ ఇచ్చిందట. ఇక రష్మిక పేరెంట్స్ అయితే ఈ విషయాన్ని కొట్టి పడేసారట . మా రష్మిక ఇప్పుడే పెళ్లి చేసుకోదు అంటూ తేల్చి చెప్పేసారట. దీంతో ఇది పుకారు గానే మిగిలిపోయింది అని ఫ్యాన్స్ బాధపడిపోతున్నారు. కొందరు ఖచ్చితంగా దీని పై అఫిషియల్ ప్రకటన రాబోతుంది అంటూ చెప్పుకొస్తున్నారు..!!