సూపర్ స్టార్ మహేష్ బాబు తాజాగా నటించిన సినిమా “గుంటూరు కారం”. సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీ ఈ సినిమా గ్రాండ్గా థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది. ఈ క్రమంలోనే సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సినిమాకి సంబంధించిన ట్రైలర్ ని రిలీజ్ చేశారు మేకర్స్ . స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు త్రివిక్రమ్ మార్క్ క్లియర్గా కనిపించింది . అంతేకాదు మహేష్ బాబు గత సినిమాలకు ఎప్పుడు కూడా రిస్ట్రిక్షన్స్ పెట్టుకునేవాడు .
కానీ ఈ సినిమాల విషయంలో సెన్సార్ కట్ లేకుండా చెలరేగిపోయాడు. నోటికి వచ్చిన పదాలను అవలీలగా మాట్లాడేస్తూ మాస్ జాతర చూపించాడు. ట్రైలర్ లో మహేష్ అభిమానులకు కావాల్సిన మాస్ మసాలా దట్టంగా దట్టించాడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు. ఈ సినిమాలో మహేష్ బాబు స్టైల్ డైలాగ్ డెలివరీ ఆటిట్యూడ్ ఫ్యాన్స్ ను ఫిదా చేసేసింది . అంతేకాదు ట్రైలర్ లో “చూడగానే మజా వచ్చిందా..?, హార్ట్ బీట్ పెరిగిపోయిందా ..? ఈలవేయాలనిపించిందా..? ఆట చూస్తావా ..? అంటూ మహేష్ బాబు చెప్పిన డైలాగ్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి”.
అయితే ఈ ట్రైలర్ మొదట్లో మహేష్ బాబు చిన్నప్పుడు కంట్లో నిప్పురవ్వ పడుతున్నట్లు చూపిస్తారు. బహుశా మహేష్ కి కంటికి సంబంధించిన ఏదైనా జబ్బు ఉన్న మనిషిగా మనం ఈ సినిమాలో ఆయన చూడాలి ఏమో. అంతేకాదు హీరోయిన్ ని చూసేటప్పుడు కూడా ఒక కన్ను మూసి చూస్తూ ఉంటాడు. దీన్ని బట్టి చూస్తుంటే మహేష్ బాబుకి ఏదో వింత జబ్బే పెట్టినట్లు ఉన్నాడు త్రివిక్రమ్ అంటున్నారు అభిమానులు..!!