నాగార్జున క్రేజ్ ఫుల్‌గా పడిపోయింది. అసలు నాగార్జున సినిమాను కూడా కొనేందుకు ఎవ్వరూ ముందుకు రావడం లేదు. మరోవైపు నాన్ థియేట్రికల్ రైట్స్ అమ్ముడు కావడం లేదు. అలాంటి టైంలో నాగార్జున నటించిన నా సామి రంగా సినిమా నాన్ థియేట్రికల్ టాప్ లేపే రేటుకు అమ్ముడయ్యాయి. ఈ సినిమా నాన్ థియేట్రికల్ రూపంలో మొత్తం రు. 32 కోట్లు ఆర్జించింది.
సినిమా డిజిటల్, శాటిలైట్ హక్కులను మా టీవీ, హాట్‌స్టార్, హిందీ డబ్బింగ్ హక్కులను థర్డ్ పార్టీకి విక్రయించినట్టు తెలుస్తోంది. ఈ హక్కులు మొత్తంగా కలిపితే రు. 32 కోట్లు వచ్చాయట. చిట్టూరి శ్రీను నిర్మించిన ఈ సినిమాకు రు. 45 కోట్ల వరకు బడ్జెట్ అయ్యింది. నాగ్ రేంజ్‌కు ఇది చాలా ఎక్కువ. ఈ సినిమా కోసం నాగ్‌కు ఏకంగా రు. 12 కోట్లు రెమ్యునరేషన్ ఇచ్చారట.
ఓవరాల్‌గా మూడొంతుల బడ్జెట్ నాన్ థియేట్రికల్ రూపంలో వచ్చేసింది. అల్లరి నరేష్, రాజ్‌తరుణ్ ఈ సినిమాలో మరో ఇద్దరు హీరోయిన్లుగా నటించారు. సంక్రాంతికి ఐదు సినిమాల పోటీలో రిలీజ్ అవుతోన్న ఈ సినిమాపై థియేట్రికల్ భారం కూడా రు. 20 కోట్ల రేంజ్‌లో ఉంది. ఏదేమైనా ముసలోడు నాగ్ ఈ వయస్సులో కూడా మామూలుగా మాయ చేయలేదనే చెప్పాలి.