గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతోన్న కోలీవుడ్ సీనియర్ హీరో విజయ్‌కాంత్ ఈ రోజు ఉదయం మృతిచెందారు. అభిమానులు ముద్దుగా ది కెప్టెన్‌గా పిలుచుకునే విజయ్‌కాంత్‌కు 1980 – 90 టైంలో భారీగా అభిమానులు ఉండేవారు. ఆయన తన కెరీర్‌లో ఎక్కువుగా పోలీస్ పాత్రల్లో నటించి పవర్ ఫుల్ పోలీస్ హీరోగా గుర్తింపు పొందారు. ఆయన వందో సినిమా కెప్టెన్ ప్రభాకర్ హిట్ అయ్యాక అప్పటి నుంచి ఆయన కెప్టెన్‌గా అభిమానుల హృదయాల్లో నిలిచిపోయారు.
యాక్షన్, మాస్ ఇమేజ్‌తో ఆయనకు మంచి పేరు ఉండేది. ఆ తర్వాత ఆయన రాజకీయాల్లోకి వచ్చారు. 2005లో డీఎండీకే పార్టీ స్థాపించారు. అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకుని ఆయన ఎమ్మెల్యేగా కూడా గెలిచారు. విరుదాచలం నుంచి ఆయన అసెంబ్లీకి ఎన్నికయ్యారు. అభిమానులకు ఎప్పుడూ దగ్గరగా ఉండే ఆయన గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో హాస్పటల్లో అడ్మిట్ అయ్యి ఉన్నారు.
ఇటీవల హాస్పటల్ నుంచి డిశ్చార్జ్ అయిన ఆయనకు కరోనా సోకడంతో తిరిగి హాస్పటల్లో జాయిన్ అయ్యారు. తీవ్రమైన శ్వాసకోస సమస్యలు తలెత్తడంతో ఆయన తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. విజయ్‌కాంత్ మృతిపట్ల తమిళనాడు సినీ అభిమానుల్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. పలువురు సినీ, రాజకీయ, ఇతర రంగాలకు చెందిన ప్రముఖులు తమ సంతాపాలు వ్యక్తం చేస్తున్నారు.