ఈ మధ్యకాలంలో హీరోయిన్ సమంతకు సంబంధించిన వార్తలు మనం ఎక్కువగా వింటున్నాం.. మరీ ముఖ్యంగా నాగచైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత సోషల్ మీడియాలో ఆమెను ఎక్కువగా ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు జనాలు. అంతేకాదు సమంతకి మయోసైటీస్ వ్యాధి రావడం కూడా బిగ్ మైనస్ గా మారింది . సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టి మరి మయోసైటిస్ ట్రీట్మెంట్ తీసుకోవడానికి దేశ విదేశాలు తిరిగింది.
ఇప్పుడు ఆరోగ్యం కుదుటపడింది . అయినా సరే సినిమా ఇండస్ట్రీలో నటించడానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదు . సినిమాలను ప్రొడ్యూస్ చేయడానికి కొత్తగా ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేసింది. అయితే సమంత నిజానికి సినిమాలో నటించాలని అనుకునిందట . కానీ యంగ్ జనరేషన్ ఎక్కువగా ఇండస్ట్రీలోకి రావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉండడంతో సమంత కొత్త వాళ్లకి అవకాశం ఇవ్వడానికి ఆమె తన కెరీర్ కి ఫుల్ స్టాప్ పెట్టుకుందట .
ఆ రోజు నైట్ ఇక సినిమాలో నటించకూడదు అంటూ డిసైడ్ అయిందట . అలా ఆమె తీసుకున్న నిర్ణయం 30 కోట్లు బొక్క పెట్టేలా చేసింది . ఒకవేళ సమంత ఆరోజు సినిమాలో నటించడానికి ఒప్పుకొని ఉండి ఉంటే ఇప్పటికే ఆమె ఒక 6,7 సినిమాలకైనా సైన్ చేస్తుండేది . ఒక్కొక్క సినిమాకి మూడు నాలుగు కోట్లు వేసుకున్న దాదాపు 30 కోట్ల దాటిపోయి ఉండేది. పాపం బ్యాడ్ లక్ ఏం చేద్దాం..???