టాలీవుడ్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ – సూపర్‌స్టార్ మహేష్‌బాబు కాంబినేషన్లో 13 ఏళ్ల తర్వాత గుంటూరు కారం సినిమా వస్తోంది. గతంలో వీరి కాంబోలో అతడు, ఖలేజా సినిమాలు వచ్చాయి. ఖలేజా 2010లో వచ్చింది. 13 ఏళ్ల తర్వాత మళ్లీ వీరి కాంబినేషన్ రిపీట్ అవుతోంది. దీంతో సినిమాపై అంచనాలు ఆకాశంలోనే ఉన్నాయి. ఈ సినిమా షూటింగ్ మొదలు పెట్టినప్పటి నుంచి రకరకాల ఇబ్బందులు తప్పలేదు.
మధ్యలో హీరోయిన్ మారిపోవడం.. కొందరు టెక్నీషియన్లు మారడం.. ఇటు మహేష్ ఇంట్లో జరిగిన సంఘటనలతో గుంటూరు కారం పదే పదే ఆలస్యమైంది. ఇక రిలీజ్ డేట్ సంక్రాంతి కానుకగా జనవరి 12న చెప్పేశారు. ఇంకా ప్యాచ్ వర్క్‌తో పాటు ఒక పాట కూడా తెరకెక్కిస్తున్నారు. ఇంకా పోస్ట్ ప్రొడక్షన్, ఎడిటింగ్, రీ రికార్డింగ్ ఇలా చాలా పనులు పెండింగ్‌లో ఉన్నాయి. దర్శకుడు త్రివిక్రమ్ టెన్షన్ మామూలుగా లేదు. అనుకున్న టైంకు రాకపోతే చాలా నష్టం.
త్రివిక్రమ్ ఇలా సతమతమవుతుంటే మహేష్ మాత్రం తన మీద తీసే మాస్ పాట షూటింగ్ పూర్తయిన వెంటనే విదేశాలకు చెక్కేస్తున్నాడట. ఫ్యామిలీతో కలిసి విదేశాల్లో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఎంజాయ్ చేసి తిరిగి ఇండియాకు వస్తాడట. అప్పుడు కానీ ప్రమోషన్లు స్టార్ట్ కావడంటున్నారు. ఇంకా ప్రమోషన్లు కూడా స్టార్ట్ కాలేదు. అదే అల వైకుంఠపురంలో సినిమాకు డిసెంబర్ మిడిల్ నుంచే భయంకరమైన బజ్ వచ్చేసింది. గుంటూరు కారం సినిమాకు ఆ రేంజ్లో బజ్ లేదు. పైగా సంక్రాంతికి ఈ సారి గట్టి పోటీ ఉంది.
త్రివిక్రమ్ ఇన్ని టెన్షన్లలో ఉంటే మహేష్ మాత్రం ఎంచక్కా ఫ్యామిలీతో విదేశాలకు చెక్కేస్తున్నాడు.
మనోడు అక్కడ నుంచి వచ్చాకే ఇక్కడ ప్రమోషన్లు మొదలు పెట్టాలి. త్రివిక్రమ్ ఇటు సాంగ్ పూర్తయ్యాక, ఎడిటింగ్, ఇతర పనులతో పాటు అటు ప్రమోషన్లను కూడా చూసుకోవాలి.