సడన్గా సినిమాలు మానేసిన టాలీవుడ్ హీరో శివాజీ పొలిటికల్ టర్న్ తీసుకున్నాడు. మొదట్లో టిడిపి, బిజెపి పై విమర్శలు చేసిన శివాజీ.. ఆ తర్వాత అదే టీడీపీకి సానుభూతిపరుడుగా ఉంటూ బిజెపి ప్రభుత్వం పై విమర్శలు చేశాడు. 2019 ఎన్నికలకు ముందు గరుడ పురాణం పేరుతో బిజెపి.. టిడిపి మీద ఎలా కక్ష ?తీర్చుకోపోతుందో అంటూ పెద్ద ఎనాలసిస్ తెర మీదకు తెచ్చాడు. అప్పట్లో శివాజీ కామెంట్స్ బాగా వైరల్ అయ్యాయి. ఈ క్రమంలోనే ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ నేతలు శివాజీపై తీవ్ర విమర్శలు చేశారు. శివాజీని వ్యక్తిగతంగా కూడా టార్గెట్ చేశారు.
గతిలేక చిన్నమ్మ ఇంటికి బ్రతకడానికి వెళ్లిన శివాజీ ఆమె కూతురును లేపుకెళ్లి పెళ్లి చేసుకున్నాడు. తిన్న ఇంటి వాసాలు లెక్క పెట్టాడు. వావి వరుసలు లేకుండా చెల్లిని లేపుకెళ్ళిపెళ్ళి చేసుకున్నాడని ఆరోపణలు చేశారు. అయితే ఇదంతా అబద్ధం. వైసిపి వాళ్లు శివాజీని టార్గెట్ చేసేందుకే లేనిపోని ఆరోపణలు చేశారు. దీనిపై శివాజీ క్లారిటీ కూడా ఇచ్చారు. శివాజీ పెళ్లి చేసుకున్న అమ్మాయి పేరు శ్వేత. శివాజీది.. ఆ అమ్మాయిది ఒకే సామాజిక వర్గం కూడా కాదు. శ్వేతది గౌడ సామాజిక వర్గం. ఆమెది తెలంగాణలోని నిజామాబాద్. శివాజీ కమ్మ వ్యక్తి. పెద్దలుకుదిర్చిన ప్రేమ వివాహం.
నిజామాబాద్ జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్సీ వీజీ గౌడ్ తోడల్లుడు కూతురు శ్వేత. వీరిద్దరూ ఓ ఫంక్షన్లో కలిశారు. ఆ తర్వాత ప్రేమలో పడి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. ఇక శివాజీ పైసా కట్నం కూడా తీసుకోలేదట. పెళ్లికూడా పెద్దల సమ్మతితో చేసుకున్నాడట. అయితే శివాజీ అత్తింటి వారు ఒక కారు గిఫ్ట్ గా ఇచ్చారట. శివాజీకి ఇద్దరు పిల్లలు వీరిని సాధారణ స్కూల్లో చదివిస్తున్నాను అని చెప్పుకొచ్చాడు. దీంతో శివాజీపై వైసిపి వాళ్ళు చేసిన ఆరోపణలలో నిజం లేదని క్లారిటీ వచ్చింది. తాజాగా జరిగిన బిగ్బాస్ సీజన్ 7 లో పాల్గొన్న శివాజీ గ్రాండ్ ఫైనల్ కు వెళ్లిన సంగతి తెలిసిందే.