సలార్.. సలార్..సలార్.. ఇప్పుడు ఎక్కడ చూసినా ..ఎవ్వరి నోట విన్నా ఇదే పేరు మారుమ్రోగిపోతుంది . కనీ విని ఎరుగని రేంజ్ లో ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వడం అభిమానులకే కాదు జనాలకు సైతం ఆశ్చర్యకరంగా ఉంది . ప్రభాస్ సినిమా అంటే కచ్చితంగా హిట్ అవుతుందని తెలుసు కానీ మరీ ప్రశాంత్ నీల్ ఈ రేంజ్ లో ప్రభాస్ ని తెగించి చూపిస్తాడు అని ఎక్స్పెక్ట్ చేయలేకపోయారు జనాలు .
అంతేకాదు ప్రభాస్ మెచ్చిన .. నటించిన తీరు అభిమానులను బాగా ఆకట్టుకుంది . సినిమా పరంగా ఓకే .. పాజిటివ్ టాక్ దక్కించుకోవడం ఓకే .. అయితే సలార్ అంటే అర్థమేంటి అన్న వార్త ఇప్పుడు వైరల్ అవుతుంది. సలార్.. సలార్.. సలార్ అంటున్నారే కానీ దానికి అసలు అర్థం ఏంటి..? అంటూ ప్రభాస్ ఫ్యాన్స్ తెగ వెతకడం మొదలుపెట్టారు. అయితే దీనికి ఆన్సర్ ప్రశాంత్ నీల్ ఇచ్చేశాడు.
ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ప్రశాంత్ నీల్.. సలార్ అంటే అర్థం సమర్థవంతమైన నాయకుడు అంటూ క్లారిటీ ఇచ్చారు . అది ఓ ఉర్దూ పదం అని ..సమర్థవంతుడైన నాయకుడికి సలార్ అని పిలుస్తారు అని చెప్పుకొచ్చారు . అంతేకాదు రాజుల కుడి భుజంగా ఉండే వాళ్ళని కూడా సలార్ అంటూ పిలుస్తారట . ఇది ప్రభాస్‌కి పర్ఫెక్ట్ టైటిల్ అంటున్నారు రెబెల్ ఫ్యాన్స్..!