Movies"సలార్" సినిమా హిట్ అవ్వడానికి మెయిన్ కారణం ఆయనేనా..? తెర వెనుక...

“సలార్” సినిమా హిట్ అవ్వడానికి మెయిన్ కారణం ఆయనేనా..? తెర వెనుక ఉండి అంత నడిపించిన రియల్ బాహుబలి..!!

టాలీవుడ్ రెబల్ హీరో ప్రభాస్ పేరు ఇప్పుడు ఓ రేంజ్ లో మారుమ్రోగిపోతుంది. ఎక్కడ చూసిన సరే ప్రభాస్ సలార్ కి సంబంధించిన వార్తలే వినిపిస్తున్నాయి. అంతేకాదు ఈ సినిమా లో ప్రభాస్ నటన, డైలాగ్స్ అభిమానులను బాగా ఆకట్టుకుంటున్నాయి. దీంతో అందరు ప్రభాస్ ని మెచ్చుకుంటున్నారు.

ప్రభాస్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటించిన సినిమా సలార్. కేజిఎఫ్ లాంటి బిగ్ బ్లాక్ బస్టర్ సిరీస్ తర్వాత ప్రశాంత్ నీల్ కూడా అంతే టైం టేకింగ్ తీసుకొని చేసిన సినిమా సలార్ కావడం గమనార్హం. ఈ సినిమాని అందరిలాగా భారీ భారీ యాక్షన్ సీన్స్ తో కళ్ళు చెదిరిపోయే రేంజిలో తీయాలి అని అనుకోలేదు ప్రశాంత్ నీల్.. చాలా సింపుల్ కాన్సెప్ట్ తో ప్రభాస్ ని జనాల్లోకి తీసుకెళ్లి ఆయనలోని స్పెషల్ టాలెంట్ను బయటపెట్టాలనుకున్నాడు .

అనుకున్న విధంగానే చేశాడు . కానీ మధ్య మధ్యలో ఆటోమేటిక్గా కేజిఎఫ్ సీన్స్ గుర్తు చేసే విధంగా కొన్ని సీన్స్ రావడం మనం గమనించవచ్చు. కొద్దిసేపటి క్రితమే రిలీజ్ అయిన ప్రభాస్ సినిమా బాక్సాఫీస్ వద్ద దుమ్ము దులిపేస్తుంది. రికార్డులు బద్దలు కొట్టేలా చేస్తుంది. బాహుబలి ఈ సినిమా ముందు వేస్ట్ అన్న కామెంట్స్ కూడా దక్కించుకుంటుంది అంటే ప్రభాస్ ని ప్రశాంత్ నీల్ ఈ సినిమాలో ఏ విధంగా చూపించాడో అర్థం చేసుకోవచ్చు .

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news