Movies' స‌లార్ ' డే 1 వ‌సూళ్ల అంచ‌నా... ఇండియ‌న్ హిస్ట‌రీలో...

‘ స‌లార్ ‘ డే 1 వ‌సూళ్ల అంచ‌నా… ఇండియ‌న్ హిస్ట‌రీలో సెన్షేష‌న్ మార్క్ ప‌క్కా…!

దేశవ్యాప్తంగా ఉన్న సినీ జనాలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా సినిమా సలార్ ఎట్టకేలకు గత రాత్రి థియేటర్లలో పడిపోయింది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా, శృతిహాసన్ హీరోయిన్గా సెన్సేషనల్ దర్శకుడు ప్రశాంత్ నీల్‌ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ కాగా ఇప్పుడు ఆ అంచనాలు అన్ని రీచ్ అయ్యే దిశగా బాక్సాఫీస్ దగ్గర గర్జించబోతోంది.

ప్రీమియర్ షోలు అలా పడ్డాయో లేదో.. సినిమాకు అదిరిపోయే టాక్ వచ్చింది. ఈ సినిమాకు ఆంధ్రా నుంచి తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ, అటు నార్త్ వరకు అదిరిపోయే రేంజ్ లో బుకింగ్స్ జరిగాయి. ఇండియా వైడ్‌గా ఇప్పటికీ తొలిరోజు రికార్డు బుకింగ్స్ అందుకున్న సలార్.. ఒక ఇండియాలోనే కాకుండా టోటల్‌గా ప్రపంచవ్యాప్తంగా మాసివ్‌ బుకింగ్స్‌తో తొలిరోజు దుమ్ము దులిపెయ్యనుంది. దీంతో ఈ సినిమాకి రికార్డ్‌ ఓపెనింగ్స్ ఖాయం అయిపోయాయి.

ఈ సినిమాకు వచ్చిన టాక్ స్వింగ్‌లో అయితే ఈ వసూళ్లు డెఫినిట్ గా రూ.100 కోట్ల గ్రాస్ హాట్ కేక్‌లా కలెక్ట్ చేయనుంది. ఇక రూ.150 కోట్ల గ్రాస్ మార్క్ కూడా ఈజీగా అందుకునే ఛాన్స్ ఉంది. అయితే తొలిరోజు మరిన్ని స్క్రీన్లు యాడ్ అవుతుండడంతో సలార్ రూ.200 కోట్ల గ్రాస్ అందుకుంటుందా.. ఈ మార్క్ అందుకునే ఛాన్స్ కూడా ఉందని ఇండియన్ ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. నిజంగా తొలి రోజు రూ.200 కోట్ల గ్రాస్ వ‌సూళ్లు అంటే మామూలు సంచలనం కాదని చెప్పాలి. ఈ రోజు సలార్ ఎలాంటి ?రికార్డులు బ్రేక్ చేస్తుందో చూడాలి.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news