Moviesఆ ఒక్క సీన్ "సలార్" టోటల్ సినిమాకి 100 బాహుబలిల బలం.....

ఆ ఒక్క సీన్ “సలార్” టోటల్ సినిమాకి 100 బాహుబలిల బలం.. హ్యాట్సాఫ్ ప్రశాంత్ నీల్.. !!

సలార్ .. టాలీవుడ్ రెబల్ హీరో తాజాగా హీరోగా నటించిన సినిమా . ప్రశాంత నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా కొద్దిసేపటి క్రితమే థియేటర్స్ లో రిలీజ్ అయి బిగ్ బ్లాక్ బస్టర్ హిట్ నమోదు చేసుకుంది. మరీ ముఖ్యంగా బాహుబలి తర్వాత సాహో ఆ తర్వాత రాధే శ్యామ్..ఆ తరువాత ఆది పురుష్ .. ఇలా మూడు సినిమాలు వచ్చినట్లే వచ్చే ఫ్లాప్ అందుకోగా ప్రభాస్ ఫ్యాన్స్ డీల పడిపోయారు. అయితే బాహుబలి సినిమా తర్వాత అలాంటి హిట్ కోసం ఎదురుచూస్తున్న ప్రభాస్ అభిమానులకు కడుపు నిండా ఫుల్ మీల్స్ పెట్టేసాడు ప్రశాంత్ నీల్.

ఒకటి కాదు రెండు కాదు 1000 కోట్లను దాటేసే సినిమా ఇది అంటూ ప్రభాస్ ఫ్యాన్స్ ఓ రేంజ్ లో ఊగిపోతున్నారు . మరీ ముఖ్యంగా ప్రభాస్ చాలా సంవత్సరాల తర్వాత ఫుల్ లెంత్ మాస్ లుక్ ఎలివేషన్స్ లో చూడడం అభిమానులకి బాగా నచ్చేసింది . సలార్ సినిమా మొత్తానికి వన్ మ్యాన్ షోల మారిపోయాడు. ప్రభాస్ సినిమాలో జగపతిబాబు – శృతిహాసన్ – పృధ్విరాజ్ లాంటి స్టార్స్ ఉన్నా కూడా అందరి కళ్ళు సలార్ సినిమాలో ప్రభాస్ పైనే పడుతున్నాయి .. అంటే దానికి ఏకైక కారణం ఆయన పర్ఫామెన్స్ డెడికేషన్ అని చెప్పాలి.

దేవ క్యారెక్టర్ లో నటించలేదు జీవించేశాడు ప్రభాస్ అంటూ కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి. అయితే ఈ సినిమా కథను చాలా డిఫరెంట్ గా రాసుకున్న ప్రశాంత్ నీల్ లాస్ట్ లో ఇచ్చిన ట్విస్ట్ సినిమా మొత్తానికి హైలైట్ గా మారిపోయింది. ప్రభాస్ కాన్పూర్ లోని శౌర్యవ్ తెగకు చెందిన వాడే అనే లాస్ట్ లో జగపతిబాబు దగ్గర రివిల్ చేయించడం అప్పటివరకు ప్రభాస్ తన ఫ్రెండ్ కోసం ఇంత కష్టపడ్డారు అని అనుకున్న జనాలకు ఒక్కసారిగా మైండ్ బ్లాక్ చేసేసింది. అంతేకాదు అసలు ప్రభాస్ ఎందుకు అలా చేశాడు..? ఆ విషయాన్ని ఎందుకు దాచి పెట్టాడు..? అన్నది మనం పార్ట్ 2 లో తెలుసుకోవాల్సిందే . ఈ ఒక్క సీన్ 100 బాహుబలి సినిమాలకు ఈక్వల్ అంటూ ప్రభాస్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు . ఆ విషయంలో రాజమౌళి ని మించిపోయాడు ప్రశాంత్ నీల్ అంటూఉ ఓ రేంజ్ లో హైప్ ఇస్తున్నారు..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news