Movies' స‌లార్‌ ' కు థియేట‌ర్లు ఇవ్వొద్దంటూ షారుక్ ఖాన్ ఫోన్‌......

‘ స‌లార్‌ ‘ కు థియేట‌ర్లు ఇవ్వొద్దంటూ షారుక్ ఖాన్ ఫోన్‌… ఇంత చెత్త రాజ‌కీయమా… సిగ్గుందేరా మీకు..!

దేశవ్యాప్తంగా ఈ ఏడాది క్రిస్మస్ కు థియేటర్లలో పెద్ద సందడి నెలకొననుంది. టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సలార్ సినిమా.. డిసెంబర్ 22న థియేటర్లలోకి వస్తుంది. ఒకరోజు ముందు బాలీవుడ్ బాద్‌షా కింగ్ షారుక్ ఖాన్ నటించిన ఢంకి సినిమా రిలీజ్ అవుతుంది. రెండు సినిమాలపై అంచనాలు మామూలుగా లేవు. కేజిఎఫ్ సిరీస్ సినిమాలతో దేశవ్యాప్తంగా టాప్ లేపిన ప్రశాంత్ నీల్.. సలార్ సినిమాకు దర్శకుడు, అటు రాజ్ కుమార్ హిరాణి ఢంకీ సినిమాకు దర్శకుడు. దీంతో హీరో – దర్శకుడు కాంబినేషన్‌లు తీసుకుంటే రెండు సినిమాలు వేటికవే టాప్ సినిమాలుగా చెప్పాలి.

అయితే షారుక్ సినిమా కంటే సలార్ సినిమా మీదే గత రెండు, మూడు నెలలుగా సోషల్ మీడియాలో విపరీతమైన చర్చ నడుస్తోంది. సలార్‌ను రిలీజ్‌కి ముందే తొక్కే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా నార్త్‌లో థియేటర్ల విషయంలో రాజకీయం మొదలైనట్టు తెలుస్తోంది. ఈ రెండు సినిమాలు థియేటర్లను పంచుకోవాలి.. పైగా హాలీవుడ్ సినిమా కూడా పోటీ ఉంది. సింగల్ స్క్రీన్‌లు, మల్టీప్లెక్స్ స్క్రీన్లు ఇలా ఎక్కడ చూసుకున్నా షారుక్ , ప్రభాస్ ఇమేజ్ భేరీజు వేసుకుని థియేటర్లు కేటాయిస్తారని అనుకున్నారు. అయితే అలా జరగటం లేదు. షారుక్ సినిమాకు అనుకూలంగా పివీఆర్, ఐనాక్స్, మీరజ్ మల్టీప్లెక్స్ చైన్ నిర్ణయం తీసుకుంది.

ఈ సంస్థలకు దేశవ్యాప్తంగా 1650 సింగిల్ స్క్రీన్ థియేటర్లు ఉన్నాయి. పివీఆర్, ఐనాక్స్ ఆధ్వర్యంలో ఉన్న ఆ స్క్రీన్‌లు అన్నింటిలోనూ ఆదివారం వరకు షారుక్‌ సినిమా షోలు షెడ్యూల్ చేశారు. బుకింగ్స్ కూడా ఓపెన్ అయ్యాయి. తొలుత రెండు సినిమాల‌కు సమంగా థియేటర్లు ఇస్తామని చెప్పిన పివిఆర్ , ఐనాక్స్ మ‌ల్టీఫ్లెక్స్ యాజ‌మాన్యం రాత్రికి రాత్రి తన నిర్ణయాన్ని మార్చుకుంది. షారుక్ సినిమాకు మేలు కలిగించేలా అడుగులు వేసింది. సలార్ సినిమాను పక్కకు తీసి పారేసింది. రాత్రికి రాత్రి పివీఆర్, ఐనాక్స్ యాజమాన్యం ప్లేట్ పెరాయించడం వెనక కింగ్ కాన్ షారుక్ ఉన్నాడని బాలీవుడ్ మీడియా వర్గాల్లో ప్రచారం జరుగుతుంది.

షారుక్ నేరుగా ఈ మల్టీప్లెక్స్ ఓనర్ల‌కు ఫోన్ చేశాడని.. అంత పెద్ద స్టార్ హీరో నుంచి డైరెక్ట్ ఫోన్ కాల్ రావడంతో పివీఆర్, ఐనాక్స్ ఆధ్వర్యంలో ఉన్న సింగల్ స్క్రీన్లు అన్నింటిని ఢంకీ సినిమాకు ఇచ్చారని.. దాంతో సలార్‌ సినిమాను నార్త్ ఇండియాలో పంపిణీ చేస్తున్న అనిల్ తడానీకి, స‌లార్‌ నిర్మాణ సంస్థకు కోపం తెప్పించిందని తెలుస్తోంది. దీంతో నార్త్ ఇండియాలో స్క్రీన్లు ఇచ్చేవరకు సౌత్ ఇండియాలో ఆ మల్టీప్లెక్స్ స్క్రీన్ల‌లో తమ సినిమా వేయకూడదని సలార్ టీం డిసైడ్ అయినట్టు తెలుస్తుంది. ఏది ఏమైనా ఈ చెత్త రాజకీయాలపై టాలీవుడ్ లో తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news