బాలీవుడ్ లో టాప్ హీరోయిన్‌గా వెలిగింది మాధురీ దీక్షిత్. మైక్రో బయాలజిస్ట్ అవ్వాలనుకున్నప్పటికీ సినిమాలంటే ఆసక్తితో ముందు క్లాసికల్ డాన్స్ నేర్చుకుంది. కథక్ ని ఎనిమిది సంవత్సరాలు నేర్చుకోవడం తన సినిమా కెరీర్ ని డాన్స్ పరంగా ఎక్కడికో తీసుకెళ్ళింది. 1984లో మాధురి దీక్షిత్ హీరోయిన్‌గా అబోద్ అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చింది.
ఆ తర్వాత తేజాబ్ సినిమాతో బాలీవుడ్ లో బాగా పాపులర్ అయింది. దాంతో వరుసగా రాం లఖన్, పరిందా, త్రిదేవ్, దిల్, లాంటి బ్లాక్ బస్టర్స్ లో నటించి ఫిల్మ్ ఫేర్ అవార్డ్ ని దక్కించుకుంది. సాజన్, బేటా, ఖల్నాయక్, హం ఆప్కే హై కౌన్, రాజా, ఇలా..బ్యాక్ టు బ్యాక్ భారీ కమర్షియల్ హిట్స్ అందుకుంది. ఆ సమయంలో మాధురి హిందీ ఇండస్ట్రీలోనే హైయ్యెస్ట్ రెమ్యునరేషన్ తీసుకున్న హీరోయిన్ గా వార్తల్లో నిలిచింది. బేటా సినిమాతో రెండవసారి కూడా ఫిల్మ్ ఫేర్ అవారడ్ ని అందుకుంది.
ఇదే సినిమాను తెలుగులో వెంకటేశ్ అబ్బాయి గారు పేరుతో రీమేక్ చేశారు. మీనా హీరోయిన్. కానీ, తెలుగులో ఈ సినిమా ఫ్లాప్ అయింది. ఇక నాగార్జున మాధురి దీక్షిత్ ని తెలుగులో తీసుకురావడానికి బాగా ట్రై చేశారట. ఆయన హీరోగా అన్నపూర్ణ బ్యానర్ లో నిరించిన ఓ సినిమాకి మాధురిని అడిగారట. కానీ, అప్పట్లో మాధురీ ఉన్న బిజీ షెడ్యూల్ కి హెవీ రెమ్యునరేషన్ కి తట్టుకోలేక డ్రాఫ్ అయ్యారట.
నాగార్జున సరసన నటించడానికి మాధురి అప్పట్లోనే కోటి రూపాయల రెమ్యునరేషన్ అడిగినట్టుగా టాక్ ఉంది. అది కూడా కేవలం 15 రోజులు మాత్రమే డేట్స్ ఇస్తానని చెప్పిందట. ఇది వర్కౌట్ అవదనుకున్న నాగార్జున మాధురిని తెలుగులో లాంఛ్ చేయాలనుకున్న ఆలోచనని విరమించుకున్నాడట. అప్పట్లో ముంబై నుంచి హీరోయిన్ ని టాలీవుడ్ కి పరిచయం చేయాలంటే ఎక్కువగా ఆసక్తి చూపించింది నాగార్జుననే. కానీ, మాధురి విషయంలో అది కుదరలేదు.