సినిమా కమిట్మెంట్లు, క్యాస్టింగ్ కౌచ్‌లు, ఛాన్సుల కోసం వాడుకోవటాలు.. ఇవన్నీ చాలా కామన్. ఇవి ఇప్పటినుంచే కాదు గత కొన్ని దశాబ్దాల నుంచి నడుస్తున్నాయి. 1960 – 70వ దశంలోనే బాలీవుడ్‌లోనూ ఇటు టాలీవుడ్‌లోను ఛాన్సులపేరుతో అమ్మాయిలను వాడుకోవడం.. లాంటి తతంగాలు నడుస్తూనే ఉన్నాయి. అయితే అప్పట్లో ఇప్పుడు ఉన్నంత మీడియా, సోషల్ మీడియా ప్రభావం లేదు. దీంతో ఈ విషయాలు పెద్దగా బయటకు వచ్చేవే కాదు. దీనికి తోడు అప్పటి తరం హీరోయిన్లు.. ఇలాంటి విషయాలు బయటపెడితే తమకు ఛాన్సులు రావేమో, తమ కేరార్ ఆగిపోతుందేమో అన్న భయంతో బయటకు చెప్పటానికి ఇష్టపడేవారు కాదు.
అయితే ఇప్పుడు నడుస్తోంది అంతా సోషల్ మీడియా యుగం. ఇలాంటి విషయాలు హీరోయిన్లు ఓపెన్ గానే చెప్పేస్తున్నారు కదా. ఐదు ఆరు సంవత్సరాలుగా ఎంతోమంది వెండితెర, బుల్లితెర నటీనటులు స్టార్ హీరోయిన్లు కూడా ఛాన్సులు కోసం తాము ఎలాంటి వేధింపులు ? ఎదుర్కొన్నామో ఓపెన్ గానే చెబుతున్నారు. ఇదిలా ఉంటే రెండున్నర దశాబ్దాల క్రితం టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగిన సీనియర్ నటిమణి కూడా ఒక సీనియర్ దర్శకుడు చేతిలో చాలా దారుణమైన లైంగిక వేధింపులు ఎదుర్కొందన్న ప్రచారం అయితే ఉంది.
ఆయన చాలా సీనియర్.. ఇండస్ట్రీలో ఎంతోమంది స్టార్ హీరోలకు ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలు ఇచ్చారు. అమ్మాయిలను ఎంత అందంగా చూపించాలో ఆయనకు మాత్రమే తెలుసు అంటారు. ఆయన చాలామంది హీరోయిన్లను వెండితెరకు పరిచయం చేశారు. ఎంతో మంది హీరోయిన్లను ఎంతో అందంగా చూపించారు. ఈ క్రమంలోనే ఒక హీరోయిన్‌కు బాగా లైఫ్ ఇవ్వడంతో పాటు తన సినిమాలలో పదే పదే తీసుకున్నారు. నిజం చెప్పాలంటే ఆ హీరోయిన్ కెరీర్ ఎప్పుడో 1986 – 87 లోనే ప్రారంభమైన ఆ డైరెక్టర్ చేతిలో పడ్డాకే.. టర్న్ అయింది. స్టార్ హీరోల సినిమాలలోనూ ఆ డైరెక్టర్ ఆమెకి ఛాన్సులు ఇచ్చారు. అయితే ఆమెను అంతే దారుణంగా వాడుకున్నారని అంటారు.
నిజానికి వయసులో తన కంటే చాలా పెద్ద అయినా ఆయనతో అలాంటి కమిట్మెంట్ ఇచ్చేందుకు ఆ హీరోయిన్‌కు మనస్ఫూర్తిగా ఇష్టం లేదని అంటారు. అయితే కెరీర్ కోసం ఆమెకు తప్ప లేదని.. అయిష్టంగా అయినా ఆ డైరెక్టర్ కు సర్వస్వం అర్పించేసిందంటారు. అలా అయిష్టంగానే ఆ డైరెక్టర్ కు లొంగిపోయిన సదరు స్టార్ హీరోయిన్.. ఆయనతో చాలా ఏళ్లపాటు చేయాల్సిన పనులు అన్నీ చేసేసిందని అంటారు. ఆ డైరెక్టర్ కూడా ఆ స్టార్ హీరోయిన్ కు హైదరాబాద్ నడిబొడ్డున కోట్లాది రూపాయల విలువైన ఓ పెద్ద బంగ్లాను కానుకగా ఇచ్చారని.. అప్పట్లో టాలీవుడ్ లో గుసగుసలు వినిపించాయి. ఆ స్టార్ డైరెక్టర్, హీరోయిన్ ఎవరు అన్నది ? పేర్లు చెప్పకపోయినా అందరికీ తెలిసిన విషయమే.