టాలీవుడ్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కు ఎలాంటి క్రేజ్ ఉంటుందో చెప్పక్కర్లేదు. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమాతో ఎన్టీఆర్ క్రేజ్ ఇప్పుడు ఏకంగా పాన్ ఇండియా రేంజ్లో మారుమోగుతుంది. ఈ క్రమంలోని ఇప్పుడు ఎన్టీఆర్ వరుస పెట్టి పాన్ ఇండియా సినిమాలు చేసేందుకు ఆసక్తితో ఉన్నారు. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో చేస్తున్న దేవర రెండు పార్ట్‌లుగా పాన్ ఇండియా సినిమాగా వస్తుంది. ఆ తర్వాత హృతిక్ రోషన్‌తో కలిసి వార్2 సినిమాలో నటిస్తున్నాడు.
ఆ తర్వాత ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో ఎన్టీఆర్ చేసే సినిమా కూడా భారీ పాన్ ఇండియా సినిమాగా వస్తోంది.
ఇక ఎన్టీఆర్ సినిమా కెరీర్ పరంగా ఎంత బిజీగా ఉన్నా.. తన కుటుంబానికి ఎంతో టైం ఇస్తాడు. తన భార్య లక్ష్మీ ప్రణతితో పాటు ఇద్దరు కుమారులు భార్గవ్ రామ్, అభయ్ రామ్‌తో కలిసి ఎక్కువ టైం స్పెండ్ చేసేందుకు ఆసక్తి చూపుతూ ఉంటాడు. కొన్నేళ్ల క్రితం వరకు ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి అసలు బయటకు వచ్చేదే కాదు. భర్త చాటు భార్యగానే ఉండేది. అయితే ఇప్పుడిప్పుడే ఆమె ఎన్టీఆర్‌కు బెస్ట్ ఫ్రెండ్స్ అయిన స్టార్ హీరోల ఇళ్ళల్లో జరిగే ఫంక్షన్లకు భర్తతో కలిసి వస్తున్నారు.
కాస్త మోడ్రన్ డ్రస్‌లతో కనువిందు చేస్తున్నారు. ఇక లక్ష్మి ప్రణతికి కేవలం 18 సంవత్సరాల వయసు ఉన్నప్పుడే ఎన్టీఆర్ తో వివాహం జరిగింది. వీరిద్దరి మధ్య దాదాపు 9 ఏళ్లకు పైగా గ్యాప్ ఉంది. వరుసకు ఎన్టీఆర్‌కు లక్ష్మీ ప్రణతి మేనకోడలు అవుతుంది. ఇక పెళ్లిచూపుల్లో కూడా ఎన్టీఆర్.. లక్ష్మి ప్రణతితో మాట్లాడేందుకు ట్రై చేసినా తల దించుకుని సిగ్గుతో ఉన్నదే తప్ప అసలు మాట్లాడలేదంట. ఇక పెళ్లి చూపులకు పెళ్ళికి మధ్య ఎనిమిది నెలల సమయం ఉందట.
ఈ ఎనిమిది నెలల కాలంలో ఎప్పుడూ కూడా లక్ష్మీ ప్రణతి నేనంటే ఇష్టం అనే విషయాన్ని నాకు అస్సలు చెప్పలేదని ఎన్టీఆర్ వెల్లడించారు. పెళ్లి తర్వాత కూడా లక్ష్మీ ప్రణతీ సిగ్గుతో.. బీడీయంగా ఉండడంతో అసలు నేనంటే నీకు ఇష్టమా.. లేక బలవంతంగా పెళ్లి చేశారా ? అన్న అనుమానం వచ్చి చాలాసార్లు అడిగాను అని కూడా చెప్పాడు. ఏది ఏమైనా ఆడవాళ్ళ ఆలోచనలు అసలు అర్థం కావని.. వాళ్ళ మనసులో ఏమనుకుంటారో బయటపడరు అంటూ.. ఎన్టీఆర్ సరదాగా చమత్కరించాడు.