Newsప్రపంచ క్రికెట్ అభిమానులకి బిగ్గెస్ట్ షాక్ ఇచ్చిన డివిలియర్స్ !!

ప్రపంచ క్రికెట్ అభిమానులకి బిగ్గెస్ట్ షాక్ ఇచ్చిన డివిలియర్స్ !!

ప్రత్యర్ధి బౌలర్లను చీల్చి చెండాడే దక్షిణాఫ్రికా క్రేజీ క్రికెట్ ప్లేయర్ ఏబి డివిలియర్స్ ఇంటర్నేషనల్ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. 114 టెస్టులు, 228 వన్డేలు, 78 టి20లు ఆడిన డివిలియర్స్ టెస్టుల్లో 8765 పరుగులు, వన్ డేల్లో 9577 పరుగులు చేశారు. ఇక టి 20ల్లో 1672 పరుగులు చేశాడు.

2004 లో ఇంగ్లాండ్ తో టెస్టు మ్యాచ్ తో తొలి ఇంటర్నేషన్ మ్యాచ్ స్టార్ట్ చేసిన డివిలియర్స్ 2005 లో అదే ఇంగ్లాండ్ తోనే మొదటి వన్డే ఆడాడు. ఇక ఫాస్టెస్ట్ 50, 100, 150 లలో ఏబి డివిలియర్స్ చరిత్ర సృష్టించాడు. కెరియర్ మొత్తం మీద 47 సెంచరీలు, 109 హాఫ్ సెంచరీలు సాధించాడు ఈ పరుగుల వీరుడు.

ఐపిఎల్ లో కూడా ఏబి తన సత్తా చాటడం జరిగింది. 141 ఐపిఎల్ మ్యాచ్ లను ఆడిన డివిలియర్స్ 3953 పరుగులను చేశాడు. దక్షిణాఫ్రికా సాధించిన ఎన్నో విజయాల్లో తన వంతు కృషి అందించి డివిలియర్స్ ప్రత్యధుల పాలిట ‘డెవిల్’యర్ గా మారాడు. మొత్తానికి ఓ అరుదైన ఆటగాడిగా అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికాడు. ఎల్లలు లేని అభిమానులని సొంతం చేసుకున్న “డివిలియర్స్” తన రిటైర్మెంట్ జీవితం ఆహ్లాదకరంగా కొనసాగాలని కోరుకుంటున్నాము.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news