టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ‘గుంటూరు కారం’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. వచ్చే సంక్రాంతి కానుకగా జనవరి 12న గుంటూరు కారం థియేటర్లలోకి రానుంది. అయితే ఈ సినిమా నుంచి వరుసగా రిలీజ్ అవుతోన్న సాంగ్స్ ప్రేక్షకులను, మహేష్ అభిమానులను పెద్దగా ఆకట్టుకోవడం లేదన్న చర్చలు సోషల్ మీడియాలో విపరీతంగా వినిపిస్తున్నాయి.
ఇక ఈ సినిమాలో మాస్ సాంగ్ కూడా మహేష్‌బాబుకు నచ్చలేదని.. అవుట్ ఫుట్‌పై మహేష్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం నడుస్తోంది. ఇక ఓ మై బేబీ పాట కూడా బాగోలేదంటూ జరుగుతోన్న ప్రచారం విషయంలో ఆ పాట రాసిన రామజోగయ్య శాస్త్రితో పాటు నిర్మాత నాగవంశీ ప్రస్టేషన్ అయ్యారు. ఇక థమన్ రాములో రాములా పాట ట్యూన్ కాపీ కొట్టేశారంటూ ఒక్కటే ట్రోలింగ్ జరుగుతోంది.
తాజాగా మాస్ బిట్ కూడా మహేష్‌కు నచ్చలేదంటూ వస్తోన్న వార్తలపై నిర్మాత నాగవంశీ ట్విట్టర్ (ఎక్స్)లో క్లారిటీ ఇచ్చారు. సినిమాలో మొత్తం నాలుగు ఫుల్ సాంగ్స్‌తో పాటూ ఒక బిట్ సాంగ్ ఉంటుందని… ఇప్పటికే మూడు ఫుల్ సాంగ్స్, ఒక బిట్ సాంగ్ షూటింగ్ పూర్తి చేసేశాం… ఈ నెల 21 నుంచి చివరి సాంగ్ షూటింగ్ ప్రారంభిస్తున్నాం అని తెలిపాడు. ఇక మహేష్‌కు మాస్ బిట్ నచ్చలేదంటూ జరుగుతోన్న ప్రచారంలో నిజం లేదని.. అదంతా గాసిప్.. కేవలం క్లిక్స్ కోసమే వాళ్లు ఇలా చేస్తున్నారంటూ మండిపడ్డారు.
మేం వీటిపై మాట్లాడకపోవడం వల్ల వాళ్లు చేస్తున్న ప్రచారం అంతా నిజం అని కాదు అని తెలిపాడు. ఇక ఈ సినిమా మిర్చి యార్డ్ నేపథ్యంలో నడుస్తోంది. మహేష్ బాడీ లాంగ్వేజ్ కి సరిపడే సరికొత్త స్టోరీతో త్రివిక్రమ్ ఈ సినిమా కథ రెడీ చేశాడు. హారిక, హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై ఈ సినిమా తెరకెక్కుతోంది.