ఐశ్వర్యరాయ్ అంటే.. పెద్దగా చెప్పాల్సిన పనిలేదు. జీన్స్ వంటి సినిమాల్లో తన నటనాభిషేకం అందరికీ తెలిసిందే. అయితే.. ఒక్కొక్కసారి ఆమెను కూడా కాదని కొత్తవారికి చాన్స్ ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఇలాంటిదే.. 2005లో విడుదలై, బాక్సాఫీసు వద్ద సూపర్‌హిట్‌గా నిలిచిన బాలీవుడ్ సినిమా ‘పరిణీత’. ఈ సినిమా పలు అవార్డులనూ సొంతం చేసుకుందీ.
అయితే.. ఈ సినిమాలో ఐశ్వర్యరాయ్ పోషించాల్సిన ప్రధాన పాత్రలో విద్యా బాలన్ నటించడం విశేషం. నిర్మాత విధు వినోద్ చోప్రా ఈ సినిమాలో హీరోయిన్‌గా ఐశ్వర్యరాయ్ అయితే బాగుంటుందని అనుకున్నారట. ముక్కోణపు ప్రేమకథ కావడంతో అనుభవం ఉన్న నటి అయితే న్యాయం చేయగలదనే ఆలోచన నిర్మాతకు ఉంటే.. దర్శకుడు ప్రదీప్ సర్కార్ మైండ్‌లో విద్యా బాలన్ ఉంది.
కానీ, ఆమె అప్పటికి ఒక్క సినిమాలోనే నటించి ఉండడంతో తమ చిత్రంలోని పాత్రకు న్యాయం చేస్తుందో లేదోనని సందేహించారు. తర్వాత, ఆమెను లుక్ టెస్ట్‌కి పిలిచారు. ఒకటి రెండు కాదు 60 ఆడిషన్స్ తర్వాత విద్య నటనపై దర్శకుడికి నమ్మకం కలిగింది. అలా విద్య సినిమాలో నటించే అవకాశం దక్కించుకుంది. లలితారాయ్ పాత్రలో ఒదిగిపోయి, ఫిల్మ్‌ఫేర్ అవార్డు అందుకుంది.
విద్యా బాలన్ బాలీవుడ్‌లో నటించిన తొలి చిత్రమిదే. దీనికన్నా ముందు ‘భలో థేకో’ అనే బెంగాలీ చిత్రంలో నటించింది. ‘పరిణీత’ విజయంతో విద్య వరుస అవకాశాలు దక్కించుకుంది. అతిథి పాత్రలు/ప్రత్యేక గీతాలు సహా 2007లో ఆరు సినిమాల్లో సందడి చేసింది. ‘బేగం జాన్’, ‘తుమారీ సులూ’, ‘శకుంతలా దేవి’ వంటి మహిళా ప్రాధాన్య చిత్రాలతో ప్రత్యేక గుర్తింపు పొందిన విద్య కూడా అందరినీ ఆకర్షించింది.