టాలీవుడ్ లో గత కొద్ది నెలలుగా యంగ్ క్రేజీ బ్యూటీ శ్రీలీల జపం నడుస్తోంది. ఆమె నటించిన తొలి రెండు సినిమాలు పెళ్లి సందడి, ధమాకా బ్లాక్ బస్టర్ హిట్లు అయ్యాయి. ధమాకా అయితే ఏకంగా రూ.120 కోట్లకు పైగా కొల్లగొట్టింది. అక్కడ నుంచి శ్రీలీల టాలీవుడ్ లో పట్టిందల్లా బంగారం అవుతుందని ఒకటే ప్రచారం చేశారు. బాలయ్య లాంటి స్టార్ హీరోలు.. పవన్ కళ్యాణ్, మహేష్ బాబు లాంటి హీరోల సినిమాలలో ఆమె ఛాన్సులు దక్కించుకుంది. కుర్ర హీరోల నుంచి స్టార్ హీరోలు, సీనియర్ హీరోలు అంతా ఆమె వెంట పడుతుండడంతో ఆమె రెమ్యూనరేషన్ కూడా ఏకంగా మూడు కోట్లకు చేరిపోయింది.
అయితే ఇక్కడే చాలామంది హీరోలు పప్పులో కాలేశారు. శ్రీలీల అందాలు చూసి మురిసిపోయారు. ఆమెకు ఉన్న క్రేజీ నేపథ్యంలో ఆమె సినిమాలో ఉంటే చాలు తమ సినిమా సూపర్ హిట్ అవుతుందని ఆశలు పెట్టుకున్నారు. ఇక్కడే వాళ్ళు కథ, కథనాలు గాలికి వదిలేసారు. ఇప్పుడు శ్రీలీల వరుసగా డిజాస్టర్లు ఇస్తోంది. గత మూడు నెలల్లో ఆమె వరుసగా మూడు డిజాస్టర్ సినిమాలు ఇచ్చింది. రామ్ – బోయపాటి కాంబినేషన్లో స్కంద, మెగా హీరో వైష్ణవ తేజ్ ఆది కేశవ, తాజాగా నితిన్ ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ సినిమాలు ఆమెకు మూడు వరుస ఫ్లాపులు వచ్చాయి.
మధ్యలో బాలయ్యతో ఆమె చేసిన భగవంత్ కేసరి సినిమా మాత్రమే సూపర్ హిట్ అయింది. ఈ సినిమాలో శ్రీలీల పాత్రకు మంచి పేరు వచ్చింది. ఇక ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ సినిమా విషయానికొస్తే.. ఈ సినిమాల ముందుగా హీరోయిన్ పాత్ర కోసం పలువురు యంగ్ హీరోయిన్ల పేర్లు పరిశీలనకు వచ్చాయి. అయితే నితిన్.. శ్రీలీలకు ఉన్న క్రేజ్ నేపథ్యంలో పట్టుబట్టి ఆమెనే హీరోయిన్గా తీసుకునేలా చేశారు. పైగా ఇది నితిన్‌కు సొంత సినిమా. ఈ సినిమాలో శ్రీలీల అందాలు చూపించడం మినహా చేసింది ఏమీ లేదు. అసలు ఆమె పాత్రకు పెద్దగా ప్రాధాన్యం కూడా లేదు. డ్యాన్సుల్లో గెంతులు వేయటం తప్ప.. హీరోయిన్ పాత్రకు ఏమాత్రం ప్రాధాన్యం లేకుండా పోయింది.
ఫైనల్‌గా ఈ సినిమా థియేటర్లు బిజినెస్ రూ.24 కోట్లు జరిగితే.. కేవలం నాలుగు కోట్లు మాత్రమే వచ్చాయి. అంటే ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ సినిమాకు ఓవరాల్ గా రు. 20 కోట్లకు పైగా నష్టాలు రానున్నాయి. నితిన్ గత డిజాస్టర్ మాచర్ల నియోజకవర్గం కంటే కూడా ఈ సినిమా అతిపెద్ద డిజాస్టర్ గా నిలిచిపోయింది. ఏది ఏమైనా టాలీవుడ్ కుర్ర హీరోలు ఇకపై శ్రీలీల అందాలు చూసి మురిసిపోయి తమ సినిమాలలో హీరోయిన్గా పెట్టుకోవడం కంటే.. ఆమె కంటే తమ సినిమాలలో కథ, కదనాలను నమ్ముకుంటే తప్ప.. హిట్లు రావు అన్న సూత్రం ఎప్పటికీ గుర్తిస్తారో చూడాలి.