Moviesటాలీవుడ్ రాజ‌కీయం ప్ర‌భాస్‌ను బ‌లి చేస్తోందెవ‌రు... ' స‌లార్‌ ' కు...

టాలీవుడ్ రాజ‌కీయం ప్ర‌భాస్‌ను బ‌లి చేస్తోందెవ‌రు… ‘ స‌లార్‌ ‘ కు రిలీజ్‌కు ముందే గ‌ట్టి దెబ్బ‌…!

టాలీవుడ్ లో ఉన్న రకరకాల రాజకీయాల వల్ల ఒక్కోసారి ఒక్కొక్కరు బలైపోతున్నారు. తాజాగా ఇప్పుడు టాలీవుడ్ పంపిణీ రంగంలో.. ముఖ్యంగా నైజాంలో ఉన్న డిస్ట్రిబ్యూషన్ వార్‌ వల్ల ప్రభాస్ సినిమాకు పెద్ద దెబ్బప‌డిపోయేలా కనిపిస్తోంది. సలార్ నైజాం రైట్స్‌ను దిల్ రాజు కొనేందుకు ముందుకు వెళ్లారు. ఆయన రూ.65 కోట్ల వరకు వెళ్లారట. అయితే మైత్రి వాళ్ళు ఏకంగా రూ.90 కోట్లు భారీ మొత్తం ఇన్వెస్ట్ చేసి సలార్ నైజాం రైట్స్ సొంతం చేసుకున్నారు. ఇందులో రూ.25 కోట్లు రికవర‌బుల్‌ అడ్వాన్స్ అంటే ఆ మేరకు కలెక్షన్లు రాకపోతే రూ.25 కోట్లు నిర్మాతలు తిరిగి మైత్రి వాళ్లకు ఇవ్వాలి.

ఇబ్బంది లేదు. మిగిలిన రూ.65 కోట్లలో రూ.15 కోట్లు జీఎస్టీ పార్ట్ ఉంటుంది. కాబట్టి అసలు సమస్య లేదు. ఇప్పుడు వచ్చిన సమస్య ఏంటంటే థియేటర్ల సమస్య. నైజాంలో థియేటర్లో ఎక్కువగా ఆసియన్ సంస్థతో పాటు.. దిల్ రాజు దగ్గర ఉంటాయి. సలార్ తో పాటు మరో సినిమా ఏది పోటీలో లేదు. కనుక థియేటర్ల సమస్య ఉండదు. అయితే ఆ మరుస‌టి వారం డిసెంబర్ 29 ఏకంగా మూడు సినిమాలు ఉన్నాయి. ఇందులో కళ్యాణ్ రామ్ డెవిల్ సినిమాపై అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాను ఆషియన్ సినిమాస్ అనుబంధ సంస్థ గ్లోబల్ సినిమాస్ నైజాంలో పంపిణీ చేస్తుంది.

ఎన్నో కొన్ని థియేటర్లు వారం రోజుల తర్వాత కచ్చితంగా డెవిల్ కోసం సలార్ ఖాళీ చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే యానిమల్, హాయ్ నాన్న సినిమాలు థియేటర్లలో ఉన్నాయి. ఈ రెండు సినిమాలు కోసం కొన్ని థియేటర్లు అయినా వదలాల్సి ఉంటుంది. పైగా షారుఖ్ ఖాన్ డంకీ సినిమా కోసం కొన్ని థియేటర్లు ఇవ్వాలి. ఇక సలార్ ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయినా కూడా సంక్రాంతికి థియేటర్‌లో ఉండదు. సంక్రాంతి వస్తున్న నాలుగు సినిమాల్లో రెండు సినిమాలు దిల్ రాజు పంపిణీ చేస్తున్నారు. ఒక సినిమా ఆషియ‌న్‌ సినిమాస్ పంపిణీ చేస్తుంది. పైగా మ‌హేష్‌బాబు గుంటూరు కారం సినిమాను దిల్ రాజు పంపిణీ చేస్తున్నారు.

వెంకటేష్ సైంధవ్‌ సినిమా వెనక ఆషియ‌న్‌ సినిమాస్‌తో పాటు సురేష్ బాబు ఉన్నారు. అందువల్ల సలార్‌కు ఎక్కువ థియేటర్లు ఒక వారం మాత్రమే దొరుకుతాయి. రెండో వారం నుంచి కొన్ని థియేటర్లు కట్ అవుతాయి. రెండు వారాల తర్వాత మరిన్ని థియేటర్లు కోల్పోవాల్సి ఉంటుంది. రెండు వారాలలో ఈ సినిమా నైజాంలో ఎంతవరకు వసూలు చేస్తుంది అన్నది కూడా చూడాల్సి ఉంది. సినిమాకు వచ్చిన టాక్‌ను బట్టి రెండు వారాల్లోనే గట్టిగా పిండుకోవాలి. ఇక సంక్రాంతికి వస్తున్న హనుమాన్ సినిమాను కూడా మైత్రి వాళ్ళు పంపిణీ చేస్తున్నారు. చాలా ధియేటర్లను నాలుగు వారాలకు అగ్రిమెంట్ చేసుకుందాం అనుకుంటే.. థియేటర్లో వాళ్ళు కేవలం రెండు వారాలకి ఇస్తున్నారట.

దీనికి తోడు స‌లార్‌కు అర్ధరాత్రి ఆటలు, అదనపు రేట్లు, అదనపు షోల కోసం మైత్రి సంస్థ తెలంగాణ ప్రభుత్వంతో అనుమతి కోసం ప్రయత్నిస్తోంది. అయితే దీనికి కూడా ఎవరో అడ్డం పడుతున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. రేట్లు పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇస్తుందేమో కానీ.. అర్ధరాత్రి ఆటలు రావడం అనుమానం అని అంటున్నారు. అర్ధరాత్రి ఆటలు అనుమతి కూడా వస్తే బెనిఫిట్ షోలో పేరిట.. డిస్ట్రిబ్యూటర్లకు కొంత అదనపు ఆదాయం సమకూరుతుంది. ఏది ఏమైనా మైత్రి మూవీస్ పంపిణీ సంస్థకు మళ్ళీ తెరవెనక ఇబ్బందులు తప్పేలా లేవు. అయితే ఇక్కడ పంపిణీరంగంలో ఉన్న రాజకీయాల వల్ల అంతిమంగా ప్రభాస్ సలార్ సినిమాకు ఇబ్బందులు తప్పడం లేదు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news