సీనియర్ హీరోయిన్ రాధిక శరత్ కుమార్ షేర్ చేసిన ఒక్క ఫోటో రకరకాల ఊహాగానాలకు దారితీసింది. రాధిక షేర్ చేసిన పొటోలో రాధిక శరత్ కుమార్ – ధనుష్ శరత్ కుమార్ బిడ్డ వరలక్ష్మితో పాటు మరో మహిళ కూడా కనిపిస్తున్నారు. అసలే సవితి బిడ్డ వరలక్ష్మికి పిన్ని రాధికకు పెద్దగా టర్మ్స్ బాగా లేవన్న ప్రచారం తెలిసిందే. వరలక్ష్మి స్వతంత్ర భావాలు ఎక్కువగా ఉన్న అమ్మాయి. తన సినిమాలు తన ప్రపంచం వేరే. అలాంటిది రాధిక ఈ ఫోటో షేర్ చేయడం వెనక ఓ ఇంట్రెస్టింగ్ ప్రేమ కథ, పెళ్లి తంతు దాగి ఉందన్న గుసగుసలు కోలీవుడ్‌లో వినిపిస్తున్నాయి.
ఈ నటీనటులు అందరూ తెలుగు వాళ్లకు బాగా పరిచయం ఉన్నవాళ్లే. వరలక్ష్మికి 38 ఏళ్లు ఇంకా పెళ్లి కాలేదు. ప్రారంభంలో తమిళ హీరో విశాల్‌తో ప్రేమాయణం పెళ్లి అంటూ ప్రచారం జరిగింది. ఏమైందో తెలియదు కానీ విశాల్‌కు హైదరాబాద్‌కు చెందిన ఒక రెడ్డి అమ్మాయితో ఎంగేజ్మెంట్ జరిగాక.. ఆ పెళ్లి క్యాన్సిల్ అయింది. విశాల్ ఇంకా స్టిల్ బ్యాచిలర్. ఇక ధనుష్ విషయానికి వస్తే అంతే వయసు ఉంటుంది. రజినీకాంత్ బిడ్డ ఐశ్వర్యతో 2004లో పెళ్లి అయితే.. ఇద్దరు కుమారులు పుట్టి పెద్దవాళ్లు అయ్యాక 18 సంవత్సరాల కాపురం చేసి మరి గత ఏడాది ఆమెకు విడాకులు ఇచ్చేశాడు.
సో ఈ రెండు ఒంటరి జీవితాలు ఒక్కటవుతాయని చెప్పటానికి ఈ ఫోటో సూచిక అని అంటున్నారు. నిజానికి ధనుష్‌కు ఐశ్వర్యతో పెళ్లి అయినా.. కొందరు హీరోయిన్లతో అఫైర్లు డేటింగులు నడిచాయి అన్న వార్తలు వచ్చాయి. శృతిహాసన్, త్రిష కృష్ణన్, అమలాపాల్, ఆండ్రియా, సింగర్ చిన్మయి వీళ్ళతో ధనుష్ చాలా కార్యకలాపాలు నడిపాడు అన్న ప్రచారం ఉంది. ఇవి కూడా ఐశ్వర్య – ధనుష్‌కు విడాకులు ఇవ్వటానికి ఒక కారణం అంటూ ఉంటారు. ఇక వరలక్ష్మీ విషయానికి వస్తే ఒక్క విశాల్‌తో తప్ప ఎవరి విషయంలోనూ ఆమె వార్తలలోకి ఎక్కలేదు. అయితే ఇప్పుడు వీరిద్దరూ ప్రేమలో పడ్డారని వీరి మధ్య కొత్త ప్రేమ చిగురిస్తోందని.. త్వరలోనే పెళ్లి చేసుకోబోతారంటూ తమిళ మీడియాలో ప్రచారం జరుగుతుంది.
రాధిక షేర్ చేసిన ఆ ఫోటో ఇందుకు బలమైన ఉదాహరణ అని సూచిస్తున్నారు. ఇక రాధిక, శరత్ కుమార్ విషయానికి వస్తే గత పెళ్లిళ్ల అనుభవాలున్నాయి. రాధికకు శరత్ కుమార్ మూడో భర్త. శరత్ కుమార్‌కు రాధిక రెండో భార్య ఒకవేళ నిజంగానే ధనుష్, వరలక్ష్మి ఇద్దరు భార్యాభర్తలు అయితే తమిళ ఇండస్ట్రీకి మంచివార్త. వారిద్దరు గతంలో పలు సినిమాలలో కలిసి చేశారు. ఒకరింటే ఒకరికి అవగాహన ఉంది. వరలక్ష్మి గతంలో కాస్త లావుగా ఉన్న ఇప్పుడు సన్నబడింది. ఆమె క్యారెక్టర్ ఆర్టిస్టుగా దూసుకుపోతోంది. ఏది ఏమైనా ధనుష్ – వరలక్ష్మి ప్రేమ పెళ్లి ఇప్పుడు తమిళ మీడియా, సోషల్ మీడియాను ఒక ఊపు ఊపుతోంది.