Moviesహైద‌రాబాద్‌లో ఆ థియేట‌ర్లో ' స‌లార్ ' సింగిల్ టిక్కెట్ రు....

హైద‌రాబాద్‌లో ఆ థియేట‌ర్లో ‘ స‌లార్ ‘ సింగిల్ టిక్కెట్ రు. 10 వేలు..!

టాలీవుడ్ యంగ్‌రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ అంటే ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళికి ఎంత అభిమాన‌మో చెప్ప‌క్క‌ర్లేదు. రాజ‌మౌళి ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కించిన బాహుబ‌లి 1,2 సినిమాల కోసం ప్ర‌భాస్ ఏకంగా ఐదేళ్లు బ‌ల్క్ డేట్లు ఇచ్చాడు. మ‌ధ్య‌లో ప్ర‌భాస్ ఏ సినిమా కూడా చేయ‌లేదు. ప్ర‌భాస్‌కు ఈ రోజు పాన్ ఇండియా రేంజ్లో ఇంత క్రేజ్ రావ‌డానికి.. నేష‌న‌ల్ స్టార్ అవ్వ‌డానికి కార‌ణం రాజ‌మౌళీయే అన్న‌ది ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు.

ఆ అభిమానంతోనే ప్ర‌భాస్ కోసం అవ‌సరం అయిన‌ప్పుడ‌ల్లా రాజ‌మౌళి ముందుకు వ‌స్తూనే ఉంటారు. తాజాగా ప్ర‌భాస్ న‌టిస్తోన్న భారీ పాన్ ఇండియా సినిమా స‌లార్‌. కేజీయ‌ఫ్ సీరిస్ సినిమాల‌తో నేష‌న‌ల్ లెవ‌ల్లో పాపుల‌ర్ అయిన క‌న్న‌డ ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ డైరెక్ట్ చేసిన సినిమా ఇది. పాన్ ఇండియా వైడ్‌గా అన్ని ప్రాంతీయ భాష‌ల్లో స‌లార్ ఈ నెల 22న రిలీజ్ అవుతోంది.

ఈ క్ర‌మంలోనే ఈ సినిమా ఫ‌స్ట్ టిక్కెట్‌ను మేక‌ర్స్ ద‌ర్శ‌కధీరుడు రాజ‌మౌళికి విక్ర‌యించారు. స‌లార్ కోసం రాజ‌మౌళి ప్ర‌భాస్‌, నీల్‌, పృధ్విరాజ్‌ను సుమారు గంట‌న్న‌ర పాటు ఇంట‌ర్వ్యూ చేశారు. ఆ త‌ర్వాత ఈ సినిమా ఫ‌స్ట్ టిక్కెట్ రాజ‌మౌళి 10, 116 రూపాయ‌ల‌కు కొనుగోలు చేశారు. స‌లార్‌కు ప్రి రిలీజ్ ఈవెంట్ లేదు. ఇదే ప్రి రిలీజ్ ఈవెంట్ అనుకోవాలేమో..!

స‌లార్ సినిమా రిలీజ్ అవుతోన్న 22వ తేదీ ఉద‌యం 7 గంటల‌కు ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని సంధ్య 70 ఎంఎం థియేట‌ర్లో ఉద‌యం షోకు గాను రాజ‌మౌళి ఈ టిక్కెట్ కొనుగోలు చేశారు. రాజ‌మౌళికి సీట్ నెంబ‌ర్ 41 కేటాయించారు. ఈ సినిమాను నైజాంలో మైత్రీ మూవీ మేక‌ర్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news