Moviesపెళ్లికి ముందు అలా చేయమంటే పారిపోయిన రామ్ చరణ్... ఉపాసననే దగ్గరుండి...

పెళ్లికి ముందు అలా చేయమంటే పారిపోయిన రామ్ చరణ్… ఉపాసననే దగ్గరుండి అన్ని నేర్పించుకుందా..?

తెరపై కొంతమంది చాలా రొమాంటిక్గా కనిపిస్తారు . నాటి బాయ్ అని కూడా పిలిపించుకుంటారు . కానీ తెర వెనక మాత్రం వాళ్ళు చాలా సిగ్గు పడిపోతూ ఉంటారు. ఆ లిస్ట్ లోకి వస్తున్నాడు అందాల హ్యాండ్సమ్ హీరో రామ్ చరణ్ . తెరపై రామ్ చరణ్ మంచి మంచి రొమాంటిక్ సీన్స్ లో బాగా నటించాడు . కానీ రియల్ లైఫ్ లో మాత్రం అంత రొమాంటిక్ ఫెలో కాదు ఈ హీరో అంటూ మెగా కుటుంబ సభ్యులే చెప్పుకొస్తున్నారు.

కాగా ఉపాసన – రాంచరణ్ ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. వీళ్ళు కలిసి చదువుకున్నారు . ఆ టైంలోనే వీళ్ళ మధ్య మంచి ఫ్రెండ్షిప్ ఏర్పడింది . ఆ తర్వాత ప్రేమగా మారి ఆ ప్రేమను కుటుంబ సభ్యులకు చెప్పి పెళ్లిగా మార్చుకున్నారు. కాగా రామ్ చరణ్ ఉపాసనని ప్రేమిస్తున్న సమయంలోనే ఫ్రెండ్స్ సరదాగా ఆమెకు ప్రపోజ్ చేయమంటూ బలవంతం చేశారట .

అది కూడా రొమాంటిక్ యాంగిల్ లో.. కానీ రామ్ చరణ్ మాత్రం ఎంత ట్రై చేసినా ఆమెకు రొమాంటిక్ గా లవ్ ప్రపోజ్ చేయలేకపోయాడట . అంతేకాదు సిగ్గుతో పరిగెత్తుకుంటూ పారిపోయాడట . ఆ తర్వాత ఉపాసనని దగ్గరుండి ఆయనకు ఎలా ప్రపోజ్ చేయాలి ..? అమ్మాయిలను ఎలా ఇంప్రెస్ చేయాలి ..? అంటూ సరదాగా కొన్ని ఫన్నీ థింగ్స్ ను నేర్పించిందట.

ఇప్పటికీ కూడా ఉపాసనకి ఏం కావాలి ..? ఎలాంటి గిఫ్ట్ ఇస్తే సర్ప్రైజ్ అవుతుంది..? అనే విషయాలు చరణ్ కి అస్సలు తెలియవట . అన్ని ఉపాసననే దగ్గరుండి నేర్పిస్తుందట . అంత అమాయకుడు మన రాంచరణ్ . మొత్తానికి మ్యారీడ్ లైఫ్ లో ఫుల్ గా సక్సెస్ అయ్యి బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఉపాసన – రాంచరణ్..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news