ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యంగ్‌రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన మోస్ట్ అవైటెడ్ సినిమా సలార్. ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర డైనోసార్‌లా గర్జించేందుకు రెడీ అవుతోన్న సలార్ సినిమా క్రిస్మస్ కానుకగా ఈ నెల 22న థియేటర్లలోకి దిగుతోంది. ప్రభాస్‌కు జోడీగా శృతీహాసన్ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమాపై అంచనాలు మామూలుగా లేవు. సలార్ రన్ టైం 2.55 గంటలు అంటున్నా మరో నిమిషంన్నర యాడ్ చేశారని అంటున్నారు.
అంటే టోటల్ రన్ టైం 176 నిమిషాలుగా ఉండనుంది. సలార్ నైజాం రైట్స్‌ను మైత్రీ మూవీ మేకర్స్ సొంతం చేసుకుంది. నైజాంలో సలార్‌ను వీరు భారీ ఎత్తున పంపిణీ చేస్తున్నారు. సలార్ రిలీజ్ రోజు ఏకంగా అన్ని థియేటర్లలో 6 షోలు ప్లాన్ చేస్తున్నారు. అంతేకాకుండా టిక్కెట్ రేట్లు పెంచేలా ప్రభుత్వాలకు వినతులు పెట్టుకుంటున్నారు.
ప్రస్తుతం ఉన్న టిక్కెట్ రేట్లకు రు. 100 అదనంగా పెంచుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి. సింగిల్ స్క్రీన్లలోనే టిక్కెట్ రేటు రు. 300 గా ఉండనుంది. ఇక మల్టీఫ్లెక్స్‌ల్లో గరిష్టంగా రు. 400కు పైనే ఉండనుంది. ఇక సలార్ రిలీజ్ రోజు ముందు అర్థరాత్రి 1 గంట నుంచే ప్రీమియర్ షోలు, స్పెషల్ షోలు ప్లాన్ చేస్తున్నారు. కొన్ని చోట్ల, తెలంగాణలో తెల్లవారు ఝామున 4 గంటల నుంచి షోలు స్టార్ట్ అవుతాయి.
ప్రభుత్వం నుంచి సానుకూల ప్రకటన వస్తే చాలు ఫస్ట్ డే ఆర్ ఆర్ ఆర్ వసూళ్ల రికార్డును సలార్ బ్రేక్ చేస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఆర్ ఆర్ సినిమాకు ఫస్ట్ డే రు. 240 కోట్ల వసూళ్లు వచ్చాయి. ఇప్పుడు సలార్‌కు మంచి టాక్ వచ్చి… టిక్కెట్ రేట్లు పెంచుకునే వెసులు బాటు ఉంటే ఇండియా వైజ్‌గా ఆర్ ఆర్ రికార్డును క్రాస్ చేస్తుందనే అంటున్నారు.