తెలుగు చిత్ర సీమలో సాంఘికం, పౌరాణికం, జానపదం, చారిత్రకం, సైన్స్ ఫిక్షన్, భక్తి రసాత్మకం ఇన్ని జానర్లల్లో నటించిన ఏకైక నటుడు నందమూరి బాలకృష్ణ మాత్రమే. ఆరేళ్ల క్రితం హిస్టారికల్ గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాతో బాక్సాఫీస్ దగ్గర సంచలనం సృష్టించారాయన. ఈ సినిమా బాలయ్య కెరీర్లో 100వ సినిమాగా తెరకెక్కింది. శాతకర్ణి విమర్శకుల ప్రశంసలందుకోవడంతోపాటు.. కమర్షియల్ గా తిరుగులేని బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది.
ఈ సినిమా తర్వాత బాలయ్య మరో హిస్టారికల్ సినిమాతో ప్రేక్షకులకు ముందుకు రావాలని ఎన్నో ప్రయత్నాలు చేసిన.. మధ్యలో ఎన్నికలు, రాజకీయాలు, కరోనా ఇతర సినిమాలతో బిజీగా ఉండటంతో కుదరలేదు. ముఖ్యంగా అఖండ తర్వాత బాలయ్య లైనప్ క్రేజీ లైనప్గా మారింది. మంచి కథలతో సినిమాలు చేస్తూ వస్తున్నారు. అందుకే ఈ హిస్టారికల్ మూవీ కాస్త వాయిదా పడుతూ వస్తోంది. శతాబ్దాల క్రితం తెలుగు నేలను పాలించిన మహారాజు శ్రీకృష్ణదేవరాయులు కథతో బాలయ్య సినిమా చేసేందుకు రెడీ అవుతున్నారు.
ప్రస్తుతం బాలయ్య.. కేఎస్ రవీంద్ర ( బాబి ) దర్శకత్వంలో తన కెరీర్లో 109వ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ 2 సినిమాను పట్టాలెక్కిస్తారు. నిజానికి బాలయ్యతో సినిమాలు చేయటానికి చాలామంది దర్శకులు ఉన్నారు. వీరులో అఖండ 2 తర్వాత ఎవరికి ? ఓకే చెపుతారు అన్న సస్పెన్స్ అయితే ప్రస్తుతానికి ఉంది. ఇక శ్రీకృష్ణదేవరాయులు జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన సినిమాను డైరెక్ట్ చేసే అవకాశం శాతకర్ణి సూపర్ హిట్ చేసిన క్రిష్కే ఇస్తారని తెలుస్తుంది.