టాలీవుడ్ ఇండస్ట్రీలో అనసూయ పేరు ఎప్పుడు మారుమ్రోగిపోతూనే ఉంటుంది . ఓసారి నెగటివ్ కామెంట్స్ తో మరోసారి పాజిటివ్ కామెంట్స్ తో.. సోషల్ మీడియాని షేక్ చేస్తూనే ఉంటుంది. కాగ ఎప్పుడైతే రౌడీ హీరో విజయ్ దేవరకొండను టార్గెట్ చేసిందో అప్పట్నుంచి జనాలు ఆయనను ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు . ఈ మధ్యనే వాటికి ఎండ్ కార్డ్ పడినట్లు తెలుస్తుంది .
అయినా సరే పలువురు ఆకతాయిలు మాత్రం పనీపాటా లేకుండా అనసూయ ఏం మాట్లాడిన దాన్ని రాద్ధాంతం చేస్తూ ..వేలు ఎత్తి చూపిస్తూ ఉంటారు . కాగా అనసూయకి ఇద్దరు పిల్లలు అన్న విషయం తెలిసిందే . ఇద్దరు కూడా మగపిల్లలే. అయితే మొదటి నుంచి అనసూయకు ఆడపిల్లలంటే చాలా ఇష్టమట . ఒక ఆడపిల్ల ఇంట్లో ఉంటే చాలా కలగా ఉంటుంది అని భావిస్తుందట.
ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది అని అభిప్రాయ పడుతుందట. ఇదే విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో చెప్పకు వచ్చింది. అయితే అదే ఇంటర్వ్యూలో “నేను ఆడపిల్లని కనాలినుకుంటున్నాను అని కానీ నా భర్త సహకరించడం లేదు అని.. ఓపెన్ గా చెప్పి షాక్ ఇచ్చింది “. ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ గా మారాయి. ప్రజెంట్ అనసూయ పలు సినిమాలతో బిజీ గా ఉంది..!!