భారతదేశంలో అత్యంత విజయవంతమైన సినీ కుటుంబంగా మెగా ఫ్యామిలీకి మంచి గుర్తింపు ఉంది. ఈ కుటుంబంలో ఏకంగా నలుగురు సూపర్ స్టార్లు చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, అల్లు అర్జున్ ఉన్నారు. ఈ కుటుంబానికి ఐదు ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థలు, బ్యానర్లు ఉన్నాయి. గత 40 సంవత్సరాలుగా టాలీవుడ్ లో మెగా కుటుంబం సినిమా రంగంలో కొనసాగుతుంది. మెగా ఫ్యామిలీ నుంచి ప్రస్తుతం ఏకంగా 11 మందికి పైగా హీరోలు ఉన్నారు. ఒక క్రికెట్ టీం మాదిరిగా ఈ హీరోలందరూ వరుసగా సినిమాలు చేస్తున్నారు.
ఏడాదిలో సగటున నెలకు ఒక సినిమా మెగా ఫ్యామిలీ హీరోలదే రిలీజ్ అవుతుంది. దీనిని బట్టి వీళ్లు తెలుగు సినిమా ఇండస్ట్రీని ఎలా శాసిస్తున్నారు ? అర్థం చేసుకోవచ్చు. భారతదేశంలో ఎన్నో ఫ్యామిలీలు రెండు మూడు తరాలుగా సినిమా రంగంలో కొనసాగుతున్నాయి. టాలీవుడ్ లోనూ నందమూరి, అక్కినేని, దగ్గుబాటి కుటుంబాలు కూడా మూడో తరంలోనూ ఇండస్ట్రీలో ఉన్నాయి. అటు బాలీవుడ్లో కపూర్, చోప్రా, బచ్చన్ ఫ్యామిలీలు కూడా ఉన్నాయి. వీళ్లంతా అత్యంత పాపులర్.. ధనిక సినిమా కుటుంబాలుగా ఇండస్ట్రీని ఏలుతున్నారు.
అయితే ఆస్తుల పరంగా చూస్తే మెగా కుటుంబం దేశంలోనే గొప్ప రిచ్చెస్ట్ సినీ కుటుంబంగా రికార్డుల్లో ఉన్నట్టు.. జాతీయ మీడియా కథనాలు చెబుతున్నాయి. కొణిదెల, అల్లు కుటుంబాలను కలిపి టాలీవుడ్ లో మెగా కుటుంబంగా పిలుస్తారు. భారతదేశంలో ఎన్నో ప్రముఖ సినీ కుటుంబాలు కోట్ల ఆస్తులకు పడగలెత్తాయి. అయినా అవేవీ మెగా ఫ్యామిలీ ఆస్తుల ముందు సాటి రావని.. జాతీయ మీడియా కథనాలు చెబుతున్నాయి. అటు చిరంజీవి నుంచి వచ్చిన వారసత్వాన్ని అందిపుచ్చుకొని ఆయన తనయుడు రామ్ చరణ్ సినిమాల్లో నటిస్తూ ఉండడంతో పాటు బిజినెస్ లోను దూసుకుపోతున్నాడు. ఇటు అల్లు అరవింద్ తిరుగులేని బిజినెస్ మ్యాన్.
కాగా ఆయన తనయుడు అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ హీరో అయిపోయాడు. ఈ రెండు కుటుంబాలకు కలిపి ఐదు నిర్మాణ సంస్థలు ఉన్నాయి. గీతా ఆర్ట్స్, అంజన ప్రొడక్షన్స్, పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్, కొణిదెల ప్రొడక్షన్ కంపెనీలు నిర్మాణంలో ఉన్నాయి. ఇక చిరంజీవి కుమార్తె సుష్మిత, నాగబాబు కుమార్తె నిహారిక కూడా ఇటీవల రెండు కొత్త బ్యానర్లు ప్రారంభించారు. ఈ సభ్యులందరి నికర ఆస్తులు విలువ కలిపితే రూ.6,000 కోట్లకు పైనే ఉంటుందని ఒక అంచనా. దీంతో దేశంలోనే మెగా ఫ్యామిలీ ఆస్తులకు ఏ సినీ కుటుంబం కూడా సరిపోదని తెలుస్తోంది.