సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు తగ్గిన వారు ఈవెంట్స్ అంటూ ఫారిన్ వెళ్ళి ఏదో ఒక రకంగా డబ్బు సంపాదిస్తుంటారు. మొహానికి మేకప్ వేసుకోనంత వరకూ ఒకే గానీ, ఒకసారి మేకప్ వేసుకొని కాస్త పాపులారిటీ వచ్చాక మళ్ళీ నార్మల్ గా బ్రతకాలంటే అసలు వల్ల కాదు. ఆ కారణంగానే చాలామంది తప్పుడు దారిలో వెళుతుంటారు కూడా.
హీరోయిన్స్ విషయంలో ఎక్కువగా ఇలాంటివి జరుగుతుంటాయి. ఒకటి రెండు సినిమాలు చేసి క్రేజ్ కి క్రేజ్ సంపాదనకి సంపాదన వస్తుంది. దాంతో కాస్త లగ్జరీగా లైఫ్ లీడ్ చేయాలనుకుంటారు. కానీ, ఈ రంగుల ప్రపంచంలో ఎవరి జీవితం ఎప్పుడు తలక్రిందులు అవుతుందో చెప్పడం చాలాకష్టం. అలాంటి సమయంలో ఏ అవకాశం వచ్చినా దాన్ని ఉపయోగించుకోవాలనుకుంటారు.
కొందరు దుబాయ్ కి ఈవెంట్స్ కోసం వెళ్ళి అక్కడ పాటలకి డాన్సులు చేసి జనాలను అలరించి ఎంతో కొంత సంపాదించుకొని వస్తుంటారు. ఇదే దుబాయ్ లో ఘోరంగా మోసపోయి కూడా అల్లాడిపోయిన వారున్నారు. స్టార్ హీరోయిన్స్ కి ఇలాంటి అనుభవం జరిగింది. టాలీవుడ్ లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా బాగా పాపులర్ అయిన నటి సన. నిన్నే పెళ్ళాడతా సినిమా నుంచి ఇండస్ట్రీలో చాలామంది పాత్రలను చేస్తూ వస్తోంది.
ఈమె ఒకసారి దుబాయ్ కి వెళ్లిందట. ఆ సమయంలో తన వద్ద నున్న బంగారం డబ్బు మొత్తం దోచుకొని నానా యాతనలు పెట్టి నరకం చూపించారట. సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వారి ద్వారా వెళితే తనకి నరకం చూపించారని మేనేజర్స్ కూడా చేతులెత్తేశారని సన వాపోయింది. అందుకే, తన కూతురుని ఇండస్ట్రీ వైపు రానివ్వలేదని..నాలాంటి కష్టాలు నా కూతురు పడకూడదని దూరం పెట్టినట్టు చెప్పింది.