టాలీవుడ్‌లో నాలుగు దశాబ్దాల నుంచి సీనియర్ హీరోలు మెగాస్టార్ చిరంజీవి, నందమూరి నటసింహం బాలకృష్ణ, విక్టరీ వెంకటేష్, కింగ్ నాగార్జున హీరోలుగా కెరీర్ కొనసాగిస్తున్నారు. ప్రతియేడాది క్యాలెండర్ ఇయర్‌లో వీరి సినిమాలు తప్పకుండా రిలీజ్ అవుతూ ఉంటాయి. ప్రతియేడాదిలోనూ వీరిలో ఎవరు పైచేయి సాధించారు ? అన్న చర్చలు చివర్లో ఇండస్ట్రీలో కామన్‌గా జరుగుతూ ఉంటాయి.
ఇక 2023 మరో పదిహేనే రోజుల్లో ముగిసిపోతోంది. ఈ యేడాదిలో ఈ నలుగురు సీనియర్ హీరోలలో ఎవరు పై చేయి సాధించారు అన్నది పరిశీలిద్దాం. ముందుగా చిరంజీవి విషయానికి వస్తే సంక్రాంతికి వాల్తేరు వీరయ్యగా, ఆగస్టులో భోళాశంకర్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. సంక్రాంతికి వచ్చిన వాల్తేరు వీరయ్యలో మాస్ మహరాజ్ రవితేజ కూడా నటించారు. బాబి దర్శకుడు కాగా… శృతీహాసన్ హీరోయిన్‌గా నటించింది.
రు. 227 కోట్ల గ్రాస్ వసూళ్లతో చిరు రీ ఎంట్రీ ఇచ్చాక అదిరిపోయే కం బ్యాక్… సూపర్ హిట్ సినిమాగా నిలిచింది. 8 నెలల గ్యాప్‌లో భోళాశంకర్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తే అతి పెద్ద ఎపిక్ డిజాస్టర్ అయ్యింది. తమన్నా హీరోయిన్ కాగా, రాడ్ డైరెక్టర్ మెహర్ రమేష్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ సినిమా చిరు పరువు చాలా వరకు తీసేసింది. ఇక మరో సీనియర్ హీరో నటసింహం బాలకృష్ణ సంక్రాంతికి వీరసింహారెడ్డి సినిమాతో అదిరిపోయే హిట్ కొట్టారు.
ఈ సినిమా ఫస్ట్ డే వరల్డ్ వైడ్‌గా ఏకంగా రు. 54 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టింది. ఇది బాలయ్య కెరీర్‌లో ఆల్ టైం హయ్యస్ట్. ఇక దసరాకు భగవంత్ కేసరితో మరో హిట్ కొట్టాడు. ఇది బాలయ్యకు వరుసగా మూడో విజయం. ఈ రెండు సినిమాలు సింగల్‌గా రు. 140 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టాయి. ఇక మిగిలిన ఇద్దరు సీనియర్లలో నాగ్, వెంకీ సినిమాలు ఈ యేడాది రాలేదు. నాగ్ గతేడాది సంక్రాంతికి బంగార్రాజుతో హిట్ కొడితే ది ఘోస్ట్‌తో డిజాస్టర్ చూశాడు.
వెంకీకి ఎఫ్ 3 తర్వాత సినిమాలు లేవు… హిట్టూ లేదు. సంక్రాంతికి నాగ్ నా సామిరంగతో, వెంకీ సైంధవ్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఏదేమైనా 2023లో ఈ నలుగురు సీనియర్ హీరోల్లో బాలయ్య వార్ వన్‌సైడ్ చేసి పైచేయి సాధించాడనే చెప్పాలి.