ఇండస్ట్రీని ఏలిన స్టార్ హీరోయిన్లు చాలామంది ఉన్నారు. ఎన్నో సూపర్ హిట్లు ఇచ్చారు. లక్షల మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. అయితే వ్యక్తిగత జీవితంలో వేయకూడని స్టెప్పులు వేసి కెరీర్ నాశనం చేసుకున్నారు. అలనాటి మేటినటి సావిత్రితో మొదలుపెడితే.. ఈ తరం హీరోయిన్ల వరకు ఎంతోమంది రాంగ్ స్టెప్పులు వేసి కెరీర్ నాశనం చేసుకుంటున్నారు. అసలు విషయంలోకి వస్తే స్టార్ హీరోయిన్ సమంత తెలుగులో ఒక వెలుగు వెలిగింది.
నాగచైతన్యతో వివాహం తర్వాత ఆమె కెరీర్ పీక్ స్టేజ్ లోకి వెళ్ళింది. ఆ తర్వాత నాలుగేళ్లకే విడాకులు, విడాకులు తర్వాత సినిమాలు చేస్తున్న కలిసి రావటం లేదు. ఇప్పుడు రకరకాల అనారోగ్య కారణాలతో సినిమాలుకు దూరంగా చికిత్స తీసుకుంటున్న పరిస్థితి. ఇవన్నీ ఇలా ఉండగానే సమంత తాజాగా నిర్మాతగా కొత్త అవతారం ఎత్తారు. ఇది ఒక్కసారిగా అందరికీ షాకింగ్ న్యూస్‌లా మారింది. మంచి కంటెంట్ ఉన్న సినిమాలు నిర్మిస్తానంటోంది. ఈ సినిమాలకు తానే బ్రాండ్ అంబాసిడర్‌గా ఉంటూ మార్కెట్ చేయాలనుకుంటుంది.
అయితే చాలామంది హీరోయిన్లు.. హీరోయిన్గా రాణించిన.. నిర్మాతగా చేతులు కాల్చుకున్నారు. అప్పటి సావిత్రి నుంచి జయసుధ, విజయనిర్మల ఆ తర్వాత విజయశాంతి, సుహాసిని ఇటీవల కాజల్, మేఘ ఆకాష్ ఇలా చాలామంది హీరోయిన్లు బ్యానర్లు స్థాపించి సినిమాలు చేస్తున్న సక్సెస్ కావడం లేదు చేతులు కాల్చుకుంటున్నారు. ఛార్మి – పూరి జగన్నాథ్ తో కలిసి నిర్మాతగా మారిన ఆమెకు సక్సెస్ కంటే ఫెయిల్యూర్స్ ఎక్కువగా వచ్చాయి. దీంతో అనేక వివాదాలతో ఛార్మి నిర్మాతగా కొనసాగుతున్నారు.
ఇప్పుడు సమంతని చూస్తుంటే సేమ్.. సావిత్రి ఎలా అయితే ఒక్కసారిగా ఉన్నత స్థితికి వెళ్లి ఆ తర్వాత గ్రాఫ్ పడిపోయి.. చివరికి ఆమె పతనావస్థకు వెళ్ళిందో.. సామ్ అడుగులు కూడా అలాగే ఉన్నట్టు కనిపిస్తున్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో సమంత అనవసరంగా నిర్మాతగా మారుతున్నారని.. ఈ పోటీ ప్రపంచంలో నిర్మాతగా సక్సెస్ అవ్వటం అంత ఈజీ కాదని.. ఈ విషయంలో సమంత ఆలోచన చేసుకోవలసిన అవసరం ఉందన్న ప్రచారం జరుగుతోంది.