టాలీవుడ్ కుర్ర క్రేజీ బ్యూటీ శ్రీలీలకు పాపం దిష్టి తగిలిందేమో..? అన్న గుసగుసలు ఇప్పుడు టాలీవుడ్లో వినిపిస్తున్నాయి. ఆమె వరుసగా ఫ్లాపులు మూటగట్టుకొంటోంది. మొన్నటికి మొన్న స్కంద, నిన్న ఆది కేశవ .. తాఆజగా ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ వరుసగా మూడు ప్లాపులు పడ్డాయి. మూడు నెలల్లో ఆమె చేసిన నాలుగు సినిమాల్లో భగవంత్ కేసరి మాత్రమే హిట్. మిగిలిన మూడు వరుసగా ప్లాపులు. పైగా ఈ మూడు సినిమాల్లో శ్రీలీల పాత్రలు మరీ… తీసికట్టుగా ఉండడంతో విమర్శలు మామూలుగా రావడం లేదు.
ఇక ఇప్పుడు శ్రీలీల అంటే డ్యాన్సులు చేస్తే సరిపోతుందిలే అన్న నిర్ణయానికి ఆమెతో సినిమాలు చేస్తోన్న దర్శకులు వచ్చేసినట్టు ఉన్నారు. శ్రీలీల రొమాంటిక్‌గా తెరమీద కనిపించి.. నాలుగు డ్యాన్సులు చేస్తూ కురచ దుస్తులు వేసుకుని ఎగిరితే సరిపోతుందని… సినిమాకు ప్లస్ అవుతుందన్న నిర్ణయానికి వారు వచ్చేసినట్టు ఉన్నారు. అయితే ఇలాగే కొనసాగితే ఆమె కెరీర్ ముగిసిపోవడానికి ఎన్నో రోజులు పట్టదంటున్నారు.
శ్రీలీల కూడా ఎక్కువ రెమ్యునరేషన్‌తో తక్కువ రోజుల్లో సినిమాలు చేయడంపై దృష్టి పెడుతోంది. కథలో బలం ఉన్న పాత్రలకు ఓకే చెప్పడం లేదు. పైగా ఆమె ఎక్స్ప్రెషన్లు అన్నీ ఒకేలా ఉంటున్నాయి. నెల రోజుల గ్యాప్‌లో వచ్చిన ఆది కేశవలోని శ్రీలీల చేసిన పాత్రకు… ఎక్స్ట్రా ఆర్డినరీలోని ఆమె పాత్రకు పెద్దగా తేడా లేదు. రెండు సినిమాలూ బ్యాక్ టూ బ్యాక్ వచ్చాయి. కనీసం ఎక్స్ప్రెషన్ల విషయంలో అయినా శ్రీలీల తన మిస్టేక్ సరి చేసుకోకపోవడం ఆమెదే తప్పు అంటున్నారు.
ఇటీవల ఒక్క భగవంత్ కేసరి సినిమాలో ఆమె పాత్రకు మాత్రమే మంచి మార్కులు పడ్డాయి. ఇక ఇప్పుడు వరుసగా ఒక్కటే పాత్రలు, ఒక్కటే ఎక్స్ప్రెషన్లతో శ్రీలీల బోర్ కొట్టేస్తుంది. ఇక గుంటూరు కారం మీదే ఆమె ఆశలు ఉన్నాయి. ఆ సినిమాలో ఆమె పాత్ర క్లిక్ కాకపోతే ఆమె సినీ కెరీర్ రొటీన్‌గా కొట్టుకుపోవడం ఖాయం.