Newsటాలీవుడ్‌లో ఈ కుర్ర హీరోపై అంత వివ‌క్ష ఎందుకు... ఇబ్బంది పెడుతోందెవ‌రు...!

టాలీవుడ్‌లో ఈ కుర్ర హీరోపై అంత వివ‌క్ష ఎందుకు… ఇబ్బంది పెడుతోందెవ‌రు…!

సంతోష్ శోభన్..టాలెంట్ ఉన్న యంగ్ హీరో. పర్ఫార్మెన్స్ పరంగా మంచి పేరు తెచ్చుకున్నాడు. హీరో మెటీరియల్. లవర్ బాయ్ కథలకి, మాస్ కథలకి సూటవుతాడు. బయటకి చెప్పకపోయినా ఇండస్ట్రీలో ఇప్పటికే చాలామంది ప్రముఖులు ఒప్పుకున్నారు. కానీ, పెద్ద బ్యానర్స్ నుంచి మాత్రం అవకాశాలు ఇవ్వడం లేదు.

ఎంత కాదన్నా ఎవరు ఒప్పుకోకపోయినా సపోర్ట్ లేకపోతే ఎంత టాలెంటెడ్ హీరో అయినా ఇండస్ట్రీలో సక్సెస్ కావడం చాలా కష్టం. అది సంతోష్ శోభన్ విషయంలో ప్రూవ్ అయిందనుకోవచ్చు. వర్షం, బాబీ, చిత్రాలకి దర్శకత్వం వహించిన శోభన్ మంచి పేరు తెచ్చుకున్నాడు. స్వతాహాగా రచయిత. రవితేజ నమిత నటించిన ఒకరాజు ఒకరాణి సినిమాలో రవితేజ స్నేహితుడిగాను కనిపించి ఆకట్టుకున్నాడు.

కానీ, అనూహ్యంగా హార్ట్ ఎటాక్ తో మరణించాడు. తెలుగులో దర్శకుడిగా చేసిన సినిమాలు 3 మాత్రమే. 4వ సినిమా భూమికతో చేయాల్సింది. కథ చెప్తున్న సమయంలో హార్ట్ స్ట్రోక్ వచ్చి కుప్ప కూలిపోయాడు. ఆ తర్వాత అతికొద్ది రోజులకే శోభన్ తమ్ముడు ప్రముఖ కమెడియన్ శ్వేత లక్ష్మీపతి మృతి చెందాడు. అలాంటి ఫ్యామిలీ నుంచి హీరోగా వచ్చి సక్సెస్ కోసం ఆరాటపడుతున్నాడు సంతోష్ శోభన్.

కుర్రాడు బావున్నాడనే అంటున్నారు తప్ప పెద్ద సంస్థలలో సినిమాలు చేసే అవకాశం ఇచ్చేవాళ్ళు లేరు. పేపర్ బాయ్, ఏక్ మినీ కథ లాంటి సినిమాలు బాగా పేరు తెచ్చాయి. కానీ, ఆ తర్వాత నటించిన కళ్యాణం కమనీయం, లైక్ షేర్ కామెంట్, మంచిరోజులొచ్చాయి, శ్రీదేవి శోభన్ బాబు లాంటి సినిమాలు బాగానే ఆకట్టుకున్నాయి. కానీ, కమర్షియల్ హీరోగా మాత్రం నెగ్గుకురాలేకపోతున్నాడు. పూరి జగన్నాధ్, వినాయక్, బోయపాటి లాంటి దర్శకుల చేతిలో పడితే మాత్రం గ్యారెంటీగా పెద్ద హీరో అవుతాడని ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news