పాపం కొరటాల శివ . టైం బాగోలేదా .?అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది . ఊహించని చిక్కుల్లో ఇరుక్కుంటూ కోర్టు కేసులు కూడా ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఆయనకు ఎదురవుతుంది . కొరటాల శివ..ప్రజెంట్ ఎన్టీఆర్ తో దేవరా అనే సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే . అయితే గతంలో మహేష్ బాబుతో తెరకెక్కించిన శ్రీమంతుడు సినిమా కారణంగా ఆయన ఇప్పుడు కొత్త చిక్కుల్లో ఇరుక్కున్నాడు.
శృతిహాసన్ – మహేష్ బాబు జంటగా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ రికార్డును బద్దలు కొట్టింది. 2015 లో విడుదలైన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. అయితే అప్పుడే ఈ సినిమా కథ మాది అంటూ కోర్టులో కేసు వేశారు రైటర్ శరత్ చంద్ర. “వేమూరి బలరాం నేత్రుత్వంలో నడిచే స్వాతి మాస పత్రికలో ప్రచురితమైన ‘చచ్చేంత ప్రేమ’ నవల ఆధారంగా ఈ సినిమా తీశారని ఆరోపిస్తూ రైటర్ శరత్ చంద్ర.. మహేష్ బాబు – కొరటాల శివ మైత్రి మూవీ మేకర్స్ పై కేసు వేశారు .
1729 / 2017 సెక్షన్ కింద ఈ కేసును నమోదు చేశారు. అయితే ఈ కేసు విచారణ ఇప్పటికి రావడం గమనార్హం . మహేష్ బాబు – నవీన్ – కొరటాల శివ హైకోర్టును ఆశ్రయిస్తూ ఈ కేసులు కొట్టేయాలని పిటీషన్స్ వేశారు . అయితే దర్శకుడు కొరటాల శివ కాపీరైట్ చట్టం కింద మాత్రం క్రిమినల్ కేసులు ఎదుర్కోవాల్సిందే అంటూ తాజాగా హైకోర్టు తేల్చేసింది . ఈ మేరకు జడ్జిమెంట్ కాపీలను విడుదల చేసింది . దీనితో కొరటాల శివ పై క్రిమినల్ కేసు నమోదయింది. అంతేకాదు దీనికి సంబంధించిన తదుపరి విచారణకు కూడా కొరటాల హాజరు కావాల్సిందే అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. శరత్ చంద్ర తరుపున ప్రముఖ పాపులర్ న్యాయవాది చల్లా అజయ్ రాజశేఖర్ వాదించడం విశేషం..!!