Newsఒకప్పుడు ఇండస్ట్రీని ఏలేసిన శ్రీను వైట్ల ..ఇప్పుడు అడ్రస్ లేకుండా పోవడానికి...

ఒకప్పుడు ఇండస్ట్రీని ఏలేసిన శ్రీను వైట్ల ..ఇప్పుడు అడ్రస్ లేకుండా పోవడానికి అసలు కారణం అదేనా..?

ఒక దర్శకుడు ఇండస్ట్రీలో సక్సెస్ అవ్వాలంటే ఖచ్చితంగా నలుగురైదుగురు రచయితల సహకారం ఉండాల్సిందే. రచయితలు దర్శకులైన వారు చాలామంది ఉన్నారు గానీ, దర్శకులు రచయితగా సక్సెస్ అయిన వారు చాలా తక్కువ. అప్పట్లో ఏ కోదండరామిరెడ్డి గొప్ప దర్శకుడు..వరుసగా చిరంజీవికే 18 హిట్స్ ఇచ్చారు. కానీ, ఆయన కథ తయారు చేసుకోలేరు.

ఇప్పుడు మన ఇండియన్ సినిమాను ప్రపంచస్థాయికి తీసుకెళ్ళిన ఎస్ ఎస్ రాజమౌళి కూడా కథ కోసం ఆయన తండ్రి విజయేంద్ర ప్రసాద్ గారి మీద ఆధారాడతారు గానీ సొంతగా కథ తయారు చేసుకోలేరు. కథలో మార్పులు చెప్పగలరు. కానీ, కథ మాత్రం రాసుకోలేరు. అలా కథ స్క్రీన్ ప్లే డైలాగ్స్ రాసుకునే దర్శకులు పూరి జగన్నాధ్, ఇప్పుడు అనిల్ రావిపూడి, కొరటాల శివ లాంటి వారున్నారు.

వీరికి కూడా రచనా సహకారం అందించే వాళ్ళు కోన వెంకట్, గోపీ మోహన్ లాంటి వారు వెనక ఉంటారు. అలాగే అప్పట్లో శ్రీను వైట్ల కి కోన వెంకట్, గోపీ మోహన్ కథ అందించేవారు. కానీ, ఆయన కొన్ని సందర్భాలలో ఆ క్రెడిట్ ని వారికి ఇచ్చేవారు కాదట. శ్రీను వైట్ల దాదాపు తన సినిమాలకి రచనా విభాగంలో కోన వెంకట్, గోపీ మోహన్, ఆ తర్వాత అనిల్ రావిపూడి లాంటి సహాయం తీసుకున్నారట.

కానీ, శ్రీను వైట్ల ఆ క్రెడిట్ ఇవ్వలేదని కోన వెంకట్ ఓ ఇంటర్వ్యూలో ఓపెన్ అయ్యారు. దూకుడు సినిమా విషయంలో క్రెడిత్ మొత్తం శ్రీను వైట్లనే తీసుకున్నారట. కానీ, ఆ సినిమా సక్సెస్ వెనక కోన వెంకట్, గోపీ మోహన్ లాంటి వారు ఉన్నారు. అంతా నేనే అని చెప్పుకున్న శ్రీను వైట్ల ఆ తర్వాత చేసిన ఆగడు సినిమాతో అడ్రస్ లేకుండా పోయారు. మళ్ళీ శ్రీను వైట్ల కోలుకున్నది లేదు. మంచి సపోర్ట్ ని కోల్పోతే ఏమవుతుందో తెలియడానికి ప్రత్యక్ష ఉదాజరణ శ్రీను వైట్లనే.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news