దగ్గుబాటి అభిరామ్ పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే . దగ్గుబాటి సురేష్ బాబు రెండవ కొడుకు అభిరామ్ పెళ్లి శ్రీలంకలో ఘనంగా జరిగింది . ఈ పెళ్లి వేడుకకు చాలా తక్కువ మంది సినీ ప్రముఖులు హాజరవ్వగా కుటుంబ సభ్యుల సమక్షంలో వీళ్ల పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది . తనకు మరదలు వరుసయ్యే ప్రత్యూషను పెళ్లి చేసుకున్నాడు అభిరామ్ . వీళ్ళ పెళ్లి ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి .
అయితే ఈ పెళ్లి ఫోటోలు పై శ్రీ రెడ్డి పెళ్లి స్పందించి.. ఫేస్బుక్లో పోస్ట్ చేసింది . అది కాస్త ఇప్పుడు నెట్టింత వైరల్ గా మారింది . :మనం దేవతలుగా కొలిచే రాముడిని సీతని విడదీసిన దేశం.. సీతాదేవి శాపాలకు నిలయం ..ఆంజనేయ కోపాగ్నిలో తగలబడిపోయిన దేశం.. అశోకవనంలో సీతమ్మ రాముని కోసం తిండి నిద్రలు మాని దుఃఖితురాలైన ఆ రాక్షస రావణ లంక శ్రీలంకలో దగ్గుబాటి అభిరాం పెళ్లి ..”
“మన దేశ ఆదర్శ జంట రాములవారిని సీతమ్మవారిని విడదీసిన దేశంలో నీ పెళ్లి … దైవ నిర్ణయాన్ని నేను గౌరవిస్తాను ఎప్పటికైనా రాక్షసులు రాక్షసులే అంటూ ఫేస్బుక్లో పోస్ట్ చేసింది “. అంతేకాదు శ్రీరెడ్డి మాటలకు చాలామంది సపోర్ట్ చేస్తున్నారు . పోయి పోయి ఆ దేశంలో పెళ్లి చేసుకున్నావ్ ఏంటి అంటూ మండిపడుతున్నారు. మరికొందరు శ్రీరెడ్డి బాధలో న్యాయం ఉంది అని నమ్మించి మోసం చేశారని చెబుతున్నారు . మరికొందరు నువ్వు సీతవి ఆయన రాముడు మరి మధ్యలో ఈ ప్రత్యూష ఎవరు ..? అంటూ వ్యంగంగా ట్రోల్ చేస్తున్నారు . మొత్తానికి అనుకున్న పని చేసేసాడు దగ్గుబాటి సురేష్ బాబు ఇక శ్రీరెడ్డి ఎలా ముందుకెళ్తుందో చూడాలి..?