Newsవాట్.. జాన్వీ కపూర్ కి పెళ్ళి అయిపోయిందా..? క్రేజీ "క్లూ" ని...

వాట్.. జాన్వీ కపూర్ కి పెళ్ళి అయిపోయిందా..? క్రేజీ “క్లూ” ని ట్రెండ్ చేస్తున్న ఫ్యాన్స్..!!

జాన్వి కపూర్ .. ఈ పేరుకి ప్రత్యేక పరిచయాలు చేయాల్సిన అవసరం లేదు. సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న అందాల ముద్దుగుమ్మ . కాగా జాన్వి కపూర్ ప్రజెంట్ దేవర సినిమాతో తెలుగు డెబ్యూ ఇవ్వబోతుంది . రీసెంట్గా తన బాయ్ ఫ్రెండ్ షికార్ పెహారీయాతో కలిసి గుడికి వెళ్ళిన ఫొటోస్ వైరల్ అవుతున్నాయి. జాన్వీ కపూర్ ఎంత ట్రెండీగా ఉన్నా పూజలు ఎక్కువగా చేస్తుంది.

గుడికి కూడా ఎక్కువగా వెళుతూ ఉంటుంది . తాజాగా ఉజ్జయినిలోని మహాకాళేశ్వరుడు గుడిలో జాన్వీ కపూర్ శిఖర్ పెహరియా కనిపించారు. వీళ్ల వెంట ఓ తమిళ దర్శకుడు కూడా ఉండడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది . జాన్వి కపూర్ పింక్ శారీలో చాలా ట్రెడిషనల్ గా కనిపిస్తూ ఉండగా పూర్తిగా దైవచింతనలో మునిగిపోయినట్లు తెలుస్తోంది .

రీసెంట్గా తిరుపతి వెళ్ళినప్పుడు కూడా తన బాయ్ ఫ్రెండ్ ఆమె పక్కనే ఉండడం మనం గమనించవచ్చు . దీంతో జాన్వికపూర్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతుందని ..శిఖర్ పెహరియా నే ఆమె భర్త అని ఫిక్స్ అయిపోయారు జనాలు. మరికొందరు ఆల్ రెడీ వాళ్లకి పెళ్లి అయిపోయిందని..అందుకే ఇలా కలిసి తిరుగుతున్నారని కామెంట్స్ చేస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news