ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . నాని నటించిన “ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్” మూవీ మరికొద్ది గంటలో రిలీజ్ కాబోతుంది. ఈ క్రమంలోనే సినీ ప్రమోషన్స్ లో చురుగ్గా పాల్గొంటున్న నితిన్ సినిమాకి సంబంధించి మంచి బజ్ క్రియేట్ చేస్తున్నారు నితిన్ . తాజాగా ఓ ఇంటర్వ్యూలో షాకింగ్ విషయాని రివీల్ చేశాడు. అయితే ఈ విషయం ఇప్పుడు కొత్తగా జరిగింది కాదు .
కానీ అభిమానులకు మాత్రం ఆసక్తిని పెంచేసింది. గతంలో హీరోలు వదులుకున్న చిత్రాలు మరో హీరో చేతికి వెళ్లడం చూసాం . అయితే నితిన్ స్వయానా నచ్చిన కథను తెలుగు హీరో సిద్దు జొన్నలగడ్డ కి ఇచ్చేయడం పెద్ద హార్ట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది. సిద్దు జొన్నలగడ్డ – శ్రీనిధి కాంబినేషన్లో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్ధ కొత్త చిత్రాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే .
“తెలుసు కదా” అనే టైటిల్ తో చిన్న గ్లింప్స్ కూడా రిలీజ్ చేశారు . ఈ చిత్రానికి నీరజాకోన డైరెక్షన్ వహిస్తున్నారు. మాచర్ల షూటింగ్లో బిజీగా ఉన్నప్పుడే ఆమె ఈ కథను నితిన్ కు వివరించారట . అయితే నితిన్ కు ఈ కథ బాగా నచ్చిన సరే ఇది నా కన్నా సిద్ధూ కి బాగుంటుంది అంటూ సజెస్ట్ చేశారట . ఆరోజు రాత్రి నితిన్ సిద్ధు కు ఫోన్ చేసి ఈ కథ గురించి చెప్పి అగ్రిమెంట్ పేపర్లపై సైన్ చేయించాడట . అలా హిట్ అవుతుంది అని తెలిసిన మంచి ప్రాజెక్టును వేరే హీరోకి ఇచ్చేశాడు నితిన్.