టాలీవుడ్ నాచురల్ స్టార్ నాని దసరా సినిమాతో తిరుగులేని పాన్ ఇండియా హిట్ కొట్టారు. దసరా నాని కెరీర్‌లో ఫస్ట్ టైం రు. 100 కోట్ల క్లబ్‌లో చేరిన సినిమాగా రికార్డులకు ఎక్కింది. దసరా తర్వాత నాని ఇమేజ్, రేంజ్ మారిపోయింది. ప్రస్తుతం నాని ప్రధాన పాత్రలో, డైరెక్టర్ శౌర్యువ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఫీల్ గుడ్ సినిమా హాయ్ నాన్న.
ఈ సినిమా ఈ నెల 7న గురువారం వరల్డ్ వైడ్‌గా థియేటర్లలోకి రానుంది. ఈ సినిమాను నాని బాగా ప్రమోట్ చేస్తున్నాడు. ఈ సినిమాతో ఖచ్చితంగా సూపర్ హిట్ కొడతానన్న ధీమా అయితే నానిలో బాగా కనిపిస్తోంది. ఇక ఈ సినిమాకు రు. 27 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జరిగినట్టుగా తెలుస్తోంది. సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే చాలా సులువుగా బ్రేక్ ఈవెన్ అవుతుంది.
మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో శృతి హాసన్ గెస్ట్ రోల్ లో కనిపించనుంది. హేషం అబ్ధుల్ వాహబ్ మ్యూజిక్ అందించిన హాయ్ నాన్న ట్రైలర్ తర్వాత ప్రేక్షకుల్లోనూ మంచి అంచనాలు ఏర్పడ్డాయి.