Reviewsబిచ్చగాడు హీరో విజయ్ ఆంటోనీ "కాశీ" రివ్యూ & రేటింగ్

బిచ్చగాడు హీరో విజయ్ ఆంటోనీ “కాశీ” రివ్యూ & రేటింగ్

బిచ్చగాడు సినిమాతో తెలుగులో మంచి ఫాలోయింగ్ ఏర్పరచుకున్న విజయ్ ఆంటోనీ ఆ తర్వాత బేతాళుడు, యమన్, ఇంద్రసేన అంటూ తమిళంలో తీసిన సినిమాలన్ని తెలుగులో రిలీజ్ చేస్తున్నాడు. ప్రస్తుతం ఉదయనిధి డైరక్షన్ లో కాశీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు విజయ్. మరి ఈ సినిమా ఎలా ఉందో ఈనాటి సమీక్షలో చూద్దాం.

కథ :

అమెరికాలో డాక్టర్ గా చేసే కాశీ (విజయ్) తన గత జన్మ గురించి కలలు వస్తుంటాయి. వాటిని వెతుక్కుంటూ ఇండియాకు వస్తాడు. హీరో తల్లి గురించి తెలుసుకుని ఆశ్చర్యపోతాడు. ఆ తర్వాత తన గతాన్ని పూర్తిగా తెలుసుకోవాలన్న ఆలోచనతో అదే గ్రామంలో క్లినిక్ నడిపిస్తుంటాడు. తన తండ్రి గురించి తెలుసుకునే ప్రయత్నంలో విజయ్ ఎన్ని ఇబ్బందులు పడ్డాడు. ఈ క్రమంలో అతనికి ఎన్ని షాకులు తగిలాయి. ఫైనల్ గా తన తండ్రి ఎవరని తెలుసుకుంటాడు అనేది సినిమా కథ.

నటీనటుల ప్రతిభ :

తన ప్రతి సినిమా ఆడియెన్స్ కు కొత్త అనుభూతి ఇవ్వాలని కోరుకునే వారిలో విజయ్ ఆంటోని ఒకరు. బిచ్చగాడు మాత్రమే కాదు అంతకుముందు సినిమాలు కూడా ఇదే విధంగా నటించినవే. ఇక కాశీ కూడా కొత్త కాన్సెప్ట్ తో వచ్చిన సినిమా అని చెప్పొచ్చు. విజయ్ రెండు రకాల పాత్రల్లో బాగా అలరించాడు. హీరోయిన్స్ అంజలి, సునైనా బాగానే చేశారు. మిగతా పాత్రలన్ని పరిధి మేరకు నటించి మెప్పించారు. కమెడియన్ యొగి బాబు నటన ఆకట్టుకుంది.

సాంకేతికవర్గం పనితీరు :

రిచర్డ్ నాథన్ సినిమాటోగ్రఫీ బాగుంది. సినిమా కాన్సెప్ట్ కు తగినట్టుగా కెమెరా వర్క్ అద్భుతంగా అనిపిస్తుంది. ఉదయనిధి కథ, కథనాలు పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు. ముఖ్యంగా క్లైమాక్స్ సీన్స్ లో ప్రతిభ కనబరిచాడు. ఎడిటింగ్ ఓకే. మ్యూజిక్ బాగుంది. విజయ్ ఆంటోని నిర్మాణ విలువలు సినిమాను మరో లెవల్ కు తీసుకెళ్లాయి.

విశ్లేషణ :

కొత్త కథ దాన్ని చెప్పే విధానం రెండు బాగుంటేనే సినిమా ఆడియెన్స్ కు రీచ్ అవుతుంది. ఇలాంటి విషయాల్లో విజయ్ బాగా తెలివి ప్రదర్శిస్తాడు. తాను చెప్పబోతున్న కథను ముందే ఆడియెన్స్ యాక్సెప్ట్ చేసేలా మ్యాజిక్ చేస్తాడు.. థియేటర్ లోకి రాగానే ముందు వారి మైండ్ సెట్ మార్చేస్తాడు.

ఇక ఈ కాశీ సినిమా కూడా అంతే.. తండ్రి ఎవరు తెలుసుకునే క్రమంలో ఆడియెన్స్ ఊహించని ఎన్నో ట్విస్టులు రివీల్ చేసి షాక్ ఇస్తాడు. ముఖ్యంగా ఇంటర్వల్, ప్రీ క్లైమాక్స్ సీన్స్ సినిమాకు ప్లస్ అని చెప్పొచ్చు. సినిమాకు కెమెరా వర్క్ చాలా కష్టపడ్డారు. అవుట్ పుట్ పరంగా సినిమా ఎక్కడ వేలు ఎత్తి చూపించేలా లేదు.

అయితే కొత్త కథని చెప్పే క్రమంలో కమర్షియల్ ఇంకా ఎంటర్టైన్ మెంట్ విషయాన్ని విజయ్ ఆంటోని మర్చిపోతున్నాడు. కచ్చితమా ఆడియెన్స్ ఈ సినిమా చూసి మంచి సినిమా అని మెచ్చుకునే అవకాశం ఉంది. కాని కమర్షియల్ గా ఏమాత్రం వర్క్ అవుట్ అవుతుందో చూడాలి.

ప్లస్ పాయింట్స్ :

విజయ్ ఆంటోని నటన

సినిమాటోగ్రఫీ

ప్రొడక్షన్ వాల్యూస్

మైనస్ పాయింట్స్ :

మిస్సింగ్ ఎంటర్టైన్మెంట్

స్క్రీన్ ప్లే

సాంగ్స్

బాటం లైన్ :

కాశీ.. విజయ్ ఆంటోని మార్క్ మూవీ..!

రేటింగ్ : 2.5/5

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news