సినిమా రంగంలో ఇప్పుడున్న హీరోయిన్ల మధ్య పోటీ ఎలా ఉంది? అంటే.. వెంటనే చెబుతున్న మాట .. వినిపిస్తున్న మాట.. నువ్వు కొంత చూపిస్తే.. నేను మరింత చూపిస్తా! అనే!! ఇది వాస్తవం కూడా. తెరమీద హాట్ సీన్లు పెరిగిపోవడానికి నేటి యువ హీరోయిన్ల మధ్య ఉన్న పోటీనే కారణమని అంటున్నారు పరిశీల కులు కూడా. నటన మాట ఎలా ఉన్నప్పటికీ.. చూపించడంలో మాత్రం పోటీ తీవ్రంగానే ఉంది.
ఇక, ఓల్డ్ సినిమాల్లోనూ హీరోయిన్ల మధ్య పోటీ ఉండేది. అయితే.. అప్పట్లో ఈ చూపించడాలు లేవు. దీంతో ఆరోగ్యకరమైన పోటీ వాతావరణం కనిపించేది. ముఖ్యంగా అప్పటి హీరోయిన్లు.. సంగీతం.. సాహిత్యం.. గాత్రం వంటివాటిలోనూ మెళకువలు ప్రదర్శించి.. ప్రేక్షకులను రంజింప చేసేవారు. భానుమతికి సంగీతంలో మంచి ప్రవేశం ఉంది. కథా రచయిత కూడా. దీంతో ఈ రెండు రంగాల్లోనూ ఆమె తన శైలిని ప్రదర్శించారు.
ప్రతి సినిమాలనూ తన పాటలు తనే పాడేవారు. ఒకవేళ మీకు పాటలేదు.. అని దర్శకుడు అంటే.. సీన్ చెప్పు.. పాట ఎందుకు ఉండదో చెబుతా! అని సీన్ మధ్యలో అద్భుతమైన పాటలు పెట్టిన నటీమణి భానుమతి. ఇక, ఎస్ వరలక్ష్మి కూడా.. సంగీత, గాత్రాల్లో పెద్ద పేరు తెచ్చుకున్నారు. బానుమతి అంత దూకుడు చూపించకపోయినా.. తన పాటలు తనే పాడుకునేవారు. ఇలా.. వీరి మధ్య పోటీ ఎక్కువగా ఉండేది. ఇదేసమయంలో తెరమీద పేరు సంపాయించుకున్న అంజలీదేవి కూడా.. వీరితో పోటీ పడేవారు.
అయితే.. అంజలీదేవికి.. సంగీతంలో ప్రవేశం లేదు. కానీ, తోటి నటీమణులు పాడుతుంటే.. సంగీత సాధన చేస్తుంటే.. తాను మాత్రం ఊరికేనే ఉంటా ఎలా అని.. షూటింగ్‌లు అయిపోగానే అప్పటి మెగా గాయకురాలు.. రావు బాలసరస్వతీ దేవి దగ్గర శిక్షణ తీసుకున్నారు. ఈసమయంలోనే సొంత బ్యానర్‌పై అక్కినేనితో సినిమా తీశారు. అదే సువర్ణసుందరి. ఈ సినిమాలో అంజలిదేవి కోసం.. ఆదినారాయణరావు సంగీతంలో ఒక పాటను తీసుకువచ్చారు.
అదే పిలువకురా.. అలుగకురా! అనే హిట్ సాంగ్. దీనిని అంజలీదేవితోనే పాడించారు. కానీ, షూటింగ్ తర్వాత.. ఆమె గాత్రం సినిమాకు సరిపోలేదు. దీంతో అప్పటికప్పుడు ఆమె పాటను మార్చి.. సుశీలతో పాడించారు. అయితే.. మధ్య మధ్య కోరస్‌లో మాత్రం అంజలీదేవి గొంతు వినిపిస్తుంది. ఈ పాట ఇప్పటికీ అందరికీ సుపరిచితమే..!