సినిమా ఇండస్ట్రీలో కొన్ని కొన్ని సార్లు మనం తప్పు చేయకపోయినా సరే దాని రిజల్ట్ భరించాల్సి ఉంటుంది .అది ఎలాంటి విషయంలోనైనా సరే ప్రెసెంట్ అలాంటి ఓ అఫ్ సిచువేషన్ ఫేస్ చేస్తుంది అందాల ముద్దుగుమ్మ హీరోయిన్ పూజా హెగ్డే . ఏ సినిమా టైంలో ఏ పాపం చేసిందో తెలియదు కానీ ప్రెసెంట్ ఆమె చేతిలో ఒక్కటంటే ఒక్క సినిమా కూడా లేదు . ఇకపై ఆమె ఖాతాలో సినిమాలు పడతాయి అన్న ఆశలు కూడా లేవు .
అందుకే పూజా హెగ్డే నేను చేసిన తప్పులు ఏంటి అనే విషయాలను ఆలోచించుకునే పనిలో పడిపోయిందట. అంతేకాదు రీసెంట్ గా హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఫోన్ చేసి సారీ చెప్పి క్షమించమంటూ కోరిందట . ఆచార్య సినిమా టైంలో వీళ్ళిద్దరి మధ్య మిస్ అండర్స్టాండింగ్ వచ్చిందట . అప్పటివరకు బాగానే ఉన్నా పూజ – కాజల్ ఆ తర్వాత నుంచి మాట్లాడుకోవడమే మానేశారట .
కాజల్ కూడా తన పనిలో తాను మునిగిపోయింది . పూజ తన సినిమాలు చేసుకుంటూ కాలం గడిపేసింది . ఎప్పుడైతే పూజా ఆఫర్లు అయిపోయాయో..మళ్లీ తప్పు తెలుసుకుని కాజల్ కి కాల్ చేసి సారీ చెప్పింది . పూజ హెగ్డేను ఈ సినిమాలో హీరోయిన్గా తీసుకున్నాకనే కాజల్ ని ఈ సినిమా నుంచి తప్పించారట . కాజల్ – చిరంజీవికి జోడిగా ఈ సినిమాలో నటించాల్సి ఉండింది .
అయితే కొన్ని కారణాల చేత ఆమెను తీసేసాడు కొరటాల శివ . ఈ విషయం పూజకి తెలుసు . అయితే కాజల్ కాల్ చేసి అడిగిన పూజ నాకు తెలియదు అంటూ డబల్ గేమ్ ఆడిందట . ఆ విషయం తెలుసుకున్న కాజల్ అగర్వాల్ పూజను దూరం పెట్టింది . తప్పు తెలుసుకున్న పూజా మళ్ళీ కాజల్ కి కాల్ చేసి సారీ చెప్పి ఫ్రెండ్షిప్ ను మళ్ళీ కంటిన్యూ చేస్తుంది . మధ్యలో బకరాగా మారిపోయాడు కొరటాల శివ అంటూ పలువురు జనాలు ఆయనపై వ్యంగ్యంగా కౌంటర్స్ వేస్తున్నారు.