Gossipsనాని కాదు ఆ బిగ్ స్టార్.. బిగ్ బాస్ కొత్త హోస్ట్...

నాని కాదు ఆ బిగ్ స్టార్.. బిగ్ బాస్ కొత్త హోస్ట్ అతనే..!

స్టార్ హీరోగా వెండితెర మీద రికార్డులు సృష్టిస్తున్న యంగ్ టైగర్ బుల్లితెర మీద వచ్చేందుకు ఏమాత్రం వెనుకాడలేదు. బిగ్ బాస్ షోతో తెర ఏదైనా తారకమంత్రం పనిచేయాల్సిందే అన్నట్టుగా బిగ్ బాస్ సీజన్ 1 సెన్సేషనల్ హిట్ చేశాడు తారక్. బిగ్ బాస్ నడిచినన్నిరోజులు టి.ఆర్.పి టాప్ రేంజ్ కి వెళ్లింది.

ఇక బిగ్ బాస్ సీజన్ 2 కు రంగం సిద్ధం అయ్యింది. ఈసారి తారక్ హోస్ట్ గా కష్టమే అని తెలుస్తుంది. అందుకే వేరే హీరో కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు. తారక్ ప్లేస్ ను రిప్లేస్ చేయడం అంటే కష్టమే. ఇక బిగ్ బాస్ హోస్ట్ రేసులో నాచురల్ స్టార్ నాని పేరు వినపడుతుంది. దాదాపు నాని కన్ఫాం అనుకున్నారు కాని ఇక్కడే చిన్న ట్విస్ట్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా బిగ్ బాస్ హోస్ట్ రేసులో ఉన్నాడట.

ఈమధ్యనే నా పేరు సూర్య రిలీజ్ అవడంతో తర్వాత సినిమా ఎనౌన్స్ చేయలేదు బన్ని. అది కచ్చితంగా బిగ్ బాస్ షో కోసమే అంటున్నారు. అంతేకాదు రీసెంట్ గా బన్ని ముంబై కూడా వెళ్లాడని తెలుస్తుంది. ఇదంతా బిగ్ బాస్ హోస్ట్ గా చేసేందుకే అంటూ వార్తలు వస్తున్నాయి. మరి వీటిలో ఎంత వాస్తవం ఉందన్నది బిగ్ బాస్ నిర్వాహకులు స్పందించేదాకా వెయిట్ చేయాల్సిందే.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news