ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో విజయ్ దేవరకొండ రష్మిక మందన్నాల పిక్చర్స్ ఏ రేంజ్ లో ట్రెండ్ అవుతున్నాయో మనం చూస్తున్నాం . మరి ముఖ్యంగా విజయ్ దేవరకొండ ఎక్కడ ఉంటే అక్కడ రష్మిక మందన్నా కూడా ఉండింది అనేలా ప్రూవ్ చేస్తూ కొన్ని పిక్స్ చూశాం. దివాళి సందర్భంగా ఆమె షేర్ చేసిన పిక్చర్స్ లో బ్యాక్ గ్రౌండ్ బట్టి విజయ్ దేవరకొండ రష్మిక కలిసి దివాళి సెలబ్రేషన్స్ చేసుకున్నారు అన్న వార్తలు ఎక్కువగా వైరల్ అయ్యాయి .
అయితే రీసెంట్ గా విజయ్ దేవరకొండ రష్మిక మందన్నా పర్సనల్ ఫోటో అసలు సంబంధమే లేని ఓ ఈవెంట్లో టెలికాస్ట్ చేయడం ఇప్పుడు వైరల్ గా మారింది. నాని హీరోగా మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా నటిస్తున్న సినిమా హాయ్ నాన్న. ఈ సినిమా డిసెంబర్ 7న గ్రాండ్గా థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ వైజాగ్ లో ఘనంగా నిర్వహించారు . అయితే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో స్క్రీన్ పై సడన్గా విజయ్ దేవరకొండ రష్మిక మందన్నా మాల్దీవ్స్ పిక్చర్ ప్రత్యక్షమైంది .
దీంతో ఒక్కసారిగా అక్కడ ఉండే జనాలతో పాటు మృణాల్ కూడా షాక్ అయింది . నాని సైలెంట్ గా నవ్వుకుంటూ ఉంటే మృణాల్ మాత్రం వాట్ ఇస్ దిస్ అనే విధంగా ఎక్స్ప్రెషన్ ఇచ్చింది. అయితే పరిస్థితిని కూల్ చేస్తూ సుమ తన దగ్గరే ఉన్న ఒక ఫోటోగ్రాఫర్ తో..” నువ్వేనా రా ఇలాంటి ఫోటోలు తీసింది .. సెలబ్రెటీలకి ప్రైవసీ లైఫ్ ఇవ్వవా” అంటూ సింపుల్ గా ఆ విషయాన్ని అక్కడితో కొట్టి పడేసింది . అయితే సోషల్ మీడియాలో మాత్రం హాయ్ నాన్న టీం పై విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు . అసలు అక్కడ వాళ్ళిద్దరి ఫోటో వేయాల్సిన పని ఏంట్రా..? ఇంకేం పని పాట లేదా మీకు..? బోకు వెధవల్లారా అంటూ ఘాటుగా స్పందిస్తున్నారు..!!