ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టైలిష్ స్టార్ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న అల్లు అర్జున్ ప్రెసెంట్ నటిస్తున్న సినిమా పుష్ప2. ఆయన కెరియర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన పుష్పవన్ సినిమాకు ఇది సిక్వెల్ గా తెరకెక్కుతుంది.
ఈ సినిమాతో గ్లోబల్ స్థాయిలో బన్నీ పాపులారిటీ సంపాదించుకోవడం కన్ఫామ్ అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు అభిమానులు. కాగా ఇలాంటి క్రమంలోనే సినిమా ఇండస్ట్రీలోనే ఓ రికార్డ్ క్రియేట్ చేస్తూ బన్నీ ఈ సినిమాకు ఒక్క రూపాయి కూడా రెమ్యూనరేషన్ తీసుకోవడం లేదు అంటూ ఓ న్యూస్ వైరల్ అవుతుంది.
అయితే సినిమాకు వచ్చే లాభాలలో మాత్రం 33% అందుకొనున్నాడట బన్నీ . ఈ విధంగా చూసుకుంటే మార్కెట్ లెక్కల ప్రకారం పుష్ప2 సినిమా వెయ్యి కోట్లు ఈజీగా దాటేస్తుంది. ఈ లెక్కన చూసుకున్న 33% అంటే బన్నీకు 300 కోట్లకు పైగానే దక్కుతుంది . ఇప్పటివరకు ఈ స్థాయి రెమ్యూనరేషన్ తీసుకున్న హీరోలు ఎవరు కూడా ఇండస్ట్రీలో లేరు . దీంతో ఇదే న్యూస్ ట్రెండ్ చేస్తున్నారు అభిమానులు..!!