టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోల కొడుకులు స్టార్ హీరో అవుతారనే గ్యారంటీ లేదు. సినిమా ఇండస్ట్రీలో టాలెంట్ అనేది ఎంతో ముఖ్యమనే సంగతి తెలిసిందే. టాలెంట్ లేకపోతే ఎంత కష్టపడినా ఆ కష్టానికి తగిన ఫలితం కొన్నిసార్లు దక్కకపోవచ్చు. మెగాస్టార్ చిరంజీవి కొడుకు రామ్ చరణ్ తండ్రిని మించిన తనయుడిగా ఎదిగారు. పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపును సంపాదించుకుని తండ్రికి తగ్గ తనయుడిగా ఎదిగారు.
చరణ్ ప్రస్తుతం గేమ్ ఛేంజర్ సినిమాలో నటిస్తుండగా నెగిటివ్ సెంటిమెంట్లకు చెక్ పెట్టి ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవాలని వచ్చే ఏడాది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్లలో గేమ్ ఛేంజర్ ముందువరసలో ఉండాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. అయితే రామ్ చరణ్ క్లాస్ మేట్ అయిన ఒక హీరోయిన్ ఆయనకు ఒక సినిమాలో తల్లిగా నటించింది. వినడానికి ఆశ్చర్యంగా అనిపించినా ఇది నిజం కావడం గమనార్హం.
స్టార్ హీరో రామ్ చరణ్, హీరోయిన్ శ్రియ యాక్టింగ్ కు సంబంధించి ఒకేచోట శిక్షణ తీసుకున్నారు. ఆ విధంగా వీళ్లిద్దరూ క్లాస్ మేట్స్ కాగా ఆర్.ఆర్.ఆర్ సినిమాలో చరణ్ చిన్నప్పటి పాత్రకు తల్లిగా నటించారు. చరణ్, శ్రియ వయస్సు దాదాపుగా సమానం కాగా చరణ్ కంటే చాలా సంవత్సరాల ముందే శ్రియ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. మరోవైపు మెగా హీరోలతో శ్రియ నటించిన సినిమాలలో మెజారిటీ సినిమాలు సక్సెస్ సాధించాయనే సంగతి తెలిసిందే.
శ్రియ సీనియర్ హీరోయిన్ అయినా యూత్ లో ఆమెకు క్రేజ్ ఏ మాత్రం తగ్గడం లేదు. శ్రియ ప్రస్తుతం అభినయ ప్రధాన పాత్రలకే ఓటేస్తున్నారు. ఈ ఏడాది శ్రియ నటించిన కబ్జా, మ్యూజిక్ స్కూల్ సినిమాలు విడుదలయ్యాయి. నేరగసూరన్ అనే తమిళ్ సినిమాలో శ్రియ ప్రస్తుతం నటిస్తుండగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాలను సొంతం చేసుకుంటుందో చూడాల్సి ఉంది.