అమ్రేష్ పురి. ఈ పేరు తెలుగు సినీ ప్రేక్షకులకు సుపరిచయమే. అయితే. ప్రస్తుత జనరేషన్‌కు తెలియక పోయినా.. అంతో ఇంతో అయితే పరిచయం ఉంది. బాలికా
అంటూ.. చిరంజీవి, శ్రీదేవి నటించిన సూపర్ హిట్ మూవీ.. జగదేకవీరుడు అతిలోకసుందరిలో ఆయన నటన అద్భుతం. 1990 లో కె. రాఘవేంద్ర రావు దర్శకత్వంలో చిరంజీవి హీరోగా వచ్చిన ఒక సోషియో ఫాంటసీ చిత్రం. ఈ చిత్రాన్ని వైజయంతీ మూవీస్ పతాకంపై సి. అశ్వనీదత్ నిర్మించారు. రాఘవేంద్రరావు, జంధ్యాల కలిసి స్క్రీన్ ప్లే రాశారు.
చిరంజీవి, శ్రీదేవి ప్రధాన పాత్రల్లో అమ్రేష్ పురి, కన్నడ ప్రభాకర్ కీలక రోల్స్ పోషించారు. ఈ ఒక్క సినిమా నే కాదు.. అన్నగారు ఎన్టీఆర్ నటించిన.. మేజర్ చంద్రకాంత్ సినిమాలోనూ అమ్రేష్ పురి మెప్పించారు. విలనీ పాత్రలే నటించినప్పటికీ.. తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో ఆయన ప్రత్యేక ముద్ర వేసుకున్నారు. ప్రత్యేక స్లాంగ్‌తో డైలాగులు చెప్పడం నుంచి నటన వరకు అమ్రేష్ పురి రికార్డు సృష్టించారు. అయితే.. ఆయనకు సంబంధించి ఇండస్ట్రీలో అనేక విషయలు హల్చల్ చేసేవి.
షూటింగ్ సమయాల్లోనే ఆయన మద్యం తాగేవారని.. ఉమనైజర్ అని.. ఎవరిని చూసినా వదిలి పెట్టేవారు కావని.. గ్యాసిప్‌లు వచ్చేవి. ఇక, రేప్ సీన్లలో నటించాల్చి వస్తే.. జీవించేవారని కూడా అనేవారు. ఇవి చానాళ్లు ప్రచారంలో ఉండేవి. కానీ, ఎప్పుడు అమ్రేష్ పురి మాత్రం వివాదాల జోలికి వెళ్లేవారు కాదు. తనకు ఇచ్చిన పాత్రకు న్యాయం చేసి.. పక్కకు తప్పుకొనేవారు. రెమ్యునరేషన్ విషయంలో మాత్రం ఖచ్చితంగా ఉండేవారు. ఇదే విషయాన్ని ఆయన సోదరుడు, నటుడు.. ఓం పురి రాసిన పుస్తకంలో కొన్ని విషయాలు పేర్కొన్నారు.
ఓం పురి వాస్తవానికి అమ్రేష్ పురికి సోదరుడు కాదు. కానీ, ఆయన పోలికలతో ఉన్న డూప్ మాత్రమే. డూప్ పాత్రలు వేయాల్సి వచ్చినప్పుడు ఓం పురిని వినియోగించేవారు. అయితే.. తర్వాత కాలంలో ఆయననే అమ్రేష్ పురి బ్రదర్ అనుకున్నారు. ఇక, అమ్రేష్ పురి గొప్ప దైవ భక్తుడని ఓం పురి తెలిపారు. ఆయన ఎవరినీ వేధించేవారు కాదని.. హీరోయిన్లు సహా క్యారక్టర్ ఆర్టిస్టులకు దూరంగా ఉండేవారని.. పాత్రల వరకు న్యాయం చేసేవారని చెప్పారు.
పంజాబ్‌కు చెందిన అమ్రేష్పురి .. స్వర్ణదేవాలయానికి తరచుగా వెళ్లేవారని.. అక్కడి సిద్ధాంతాలనే ఆయన పాటించేవారని.. అందుకే.. ఆయన ఎవరినీ ఇబ్బంది పెట్టలేదని.. కానీ, సినీ రంగంలో గ్యాసిప్‌లు మాత్రం అన్నయ్య
ను బాధపెట్టేవని పేర్కొన్నారు. ఓం పురి వర్మ తీసిన రాత్రి వంటి సినిమాల్లో నటించిన విషయం తెలిసిందే.