టాలీవుడ్ రెబల్ హీరో ప్రభాస్ అంటే ఇష్టపడని వాళ్ళు ఉంటారా ..? చెప్పండి ఆరడుగుల అందగాడు . ఆ అందానికి తగ్గ చిరునవ్వు.. ఎప్పుడూ హ్యాపీగా ఉండే ఫేస్ .. అబ్బబ్బ చూస్తుంటే ఇంకా చూడాలి అనిపిస్తూ ఉంటుంది. అలాంటి కటౌట్ ని ఇష్టపడని జనాలు ఎవ్వరైనా ఉంటారా..? ఎలాంటి వారైనా సరే మన ప్రభాస్ కటౌట్ చూసి పడిపోవాల్సిందే . అయితే రీసెంట్ గా అదే లిస్టులోకి ఆడ్ అయిపోయింది మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కూతురు సారా టెండూల్కర్.
ఇదే విషయాన్ని ఆమె ఓపెన్ గా చెప్పుకొచ్చింది . సోషల్ మీడియాలో సారా టెండూల్కర్ ను ఎంతో మంది పొగిడేస్తూ ఉంటారు. అయితే ఈ బ్యూటీ మాత్రం డార్లింగ్ ప్రభాస్ పై మనసు పారేసుకుంది . ఆయన నటించిన సలార్ సినిమా ట్రైలర్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నాను అంటూ పోస్ట్ పెట్టింది. అంతే దీంతో రెబల్ ఫ్యాన్స్ సైతం షాక్ అయిపోతున్నారు.
“నీకు కూడా మా డార్లింగ్ ఏ కావాల్సి వచ్చాడా సారా..?” అంటూ ఉంటే మరికొందరు పాపం శుభమన్ గిల్ ఏమైపోతాడో అంటూ ఫన్నీగా కౌంటర్ వేస్తున్నారు . క్రికెటర్ శుభమన్ గిల్ సారా డేటింగ్ చేస్తున్నారు అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే దీనిపై ఇద్దరు ఎప్పటికప్పుడు దాటవేస్తూ వస్తున్నారు. కానీ బ్యాక్ గ్రౌండ్ లో మాత్రం ఇద్దరు కలిసి లైఫ్ని మస్తుగా ఎంజాయ్ చేస్తున్నారు..!!